తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తల్లిని చూసుకోని కూతురికి 'ఆమె' ఆస్తిపై హక్కులుండవ్​!: హైకోర్టు

Mother Property Daughter Rights : తల్లి సంరక్షణను విస్మరించిన కుమార్తెకు ఆమె ఆస్తిపై హక్కులు ఉండవని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఓ పిటిషన్ విచారణ సందర్భంగా రెవెన్యూ అధికారి ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు సమర్థిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.

Mother Property Daughter Rights
Mother Property Daughter Rights

By

Published : Jul 26, 2023, 9:08 AM IST

Mother Property Daughter Rights : తల్లి సంరక్షణను విస్మరించిన కుమార్తెకు ఆమె ఆస్తిపై హక్కులు ఉండవని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. తల్లి ఆలనాపాలనా పట్టించుకోని ఓ కుమార్తె ఆస్తి రిజిస్ట్రేషన్ హక్కులను రద్దు చేస్తూ ఓ రెవెన్యూ అధికారి ఇచ్చిన ఉత్తర్వులను న్యాయస్థానం సమర్థించింది.

ఇదీ జరిగింది..
తిరుపుర్ జిల్లా ఉడుమలైపేట్‌కు చెందిన రాజమ్మాళ్ తనకు చెందిన 3 ఎకరాల భూమిని కుమార్తె సుగుణకు పేరిట 2016లో రిజిస్ట్రేషన్ చేయించింది. అయితే ఆస్తి రిజిస్ట్రేషన్​కు ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం.. సుగుణ తనను సంరక్షించట్లేదని రాజమ్మాళ్ ఆరోపించింది. ఈ క్రమంలో సుగుణ తన ఆలనా పాలనా పట్టించుకోట్లేదని ఆస్తి రిజిస్ట్రేషన్​ను రద్దు చేయాలని ఉడుమలైపేట్​ రెవెన్యూ అధికారికి రాజమ్మాళ్​ ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో రెవెన్యూ అధికారి దర్యాప్తు జరిపి.. సుగుణ ఆస్తి రిజిస్ట్రేషన్​ను రద్దు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ సుగుణ.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

రాజమ్మాళ్​ తన సంరక్షణ చూసుకుంటుందని తన కుమార్తె సుగుణకు ఆస్తి రాసిచ్చిందని విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టులో రెవెన్యూ అధికారి తెలిపారు. కానీ సుగుణ.. తన తల్లి రాజమ్మాళ్​ను పట్టించుకోలేదని అందుకే ఆస్తి రిజిస్ట్రేషన్ హక్కులను రద్దు చేసినట్లు చెప్పారు. ఈ పిటిషన్​పై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు ఎస్​.ఎం. సుబ్రహ్మణ్యం.. రెవెన్యూ అధికారి తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించారు. ఆ ఆధికారి తీసుకున్న ఉత్తర్వుల పట్ల కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.

'భర్త ఆస్తిలో భార్యకు సమాన హక్కు'
Wife Rights In Husband Property : భర్త సంపాదించిన ఆస్తిలో భార్యకు సమాన హక్కు ఉంటుందని ఇటీవలే.. మద్రాస్ హైకోర్టు ఓ కేసు విచారణ సందర్భంగా తెలిపింది. నైవేలి బొగ్గు గనిలో కన్నయన్​ నాయుడు అనే వ్యక్తి అనేక ఏళ్ల పాటు పనిచేశాడు. ఆ సమయంలో అక్కడ నుంచి తన భార్యకు కుటుంబ పోషణ కోసం డబ్బులు పంపించాడు. కన్నయన్​ భార్య.. ఆ డబ్బులతో కొంత విలువైన ఆస్తి కొనుగోలు చేసింది. అయితే ఆ ఆస్తిపై తనకు మాత్రమే హక్కు ఉందని.. భార్యకు లేదని అతడు కొన్ని రోజుల క్రితం.. దిగువ కోర్టులో పిటిషన్ వేశాడు. పిటిషన్​ స్వీకరించిన దిగువ కోర్టు విచారణ జరిపింది. కన్నయన్​ నాయుడి ఆస్తిలో అతడితోపాటు భార్యకు కూడా సమాన హక్కు ఉందని తీర్పునిచ్చింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ABOUT THE AUTHOR

...view details