తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నదిలో నవజాత శిశువు- అసలేమైంది? - ఉత్తర్​ప్రదేశ్​లో ఘోరం

అప్పుడే పుట్టిన నవజాత శిశువును నదిలో వదిలిపెట్టిందో తల్లి. అమ్మతనానికి మచ్చతెచ్చే ఈ సంఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

Mother leaves newborn in Yamuna river for being transgender
నవజాత శిశువును నదిలో వదిలివెళ్లిన తల్లి

By

Published : May 7, 2021, 12:00 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ మథురలోని యమునా నది ఒడ్డున ఓ పడవలో.. తెల్లటి వస్త్రాల్లో చుట్టి ఉన్న ఓ నవజాత శిశువును రక్షించారు పోలీసులు. ఆ చిన్నారిని తల్లే అక్కడ వదిలి వెళ్లినట్లుగా భావిస్తున్నారు పోలీసులు.

ఇదీ జరిగింది..

బృందావన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చాముండా ఘాట్ వద్ద ఒక పడవలో ఏడుస్తున్న ఒక నవజాత శిశువును స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారమివ్వగా.. వారు శిశువును రక్షించి.. చైల్డ్​లైన్ బృందంతో కలిసి జిల్లా ఆసుపత్రికి పంపారు. అయితే పరీక్షల్లో సదరు శిశువును ట్రాన్స్​జెండర్​గా గుర్తించారు వైద్యులు.

మూడు కిలోల బరువున్న శిశువు పూర్తి ఆరోగ్యంతో ఉన్నప్పటికీ.. ట్రాన్స్​జెండర్​ అనే కారణంతోనే తల్లి ఇలా వదిలి వెళ్లి ఉండొచ్చని జిల్లా ఆసుపత్రి వైద్యుడు కిషోర్ మాథుర్ అభిప్రాయపడ్డారు. శిశువుకు ఇతర ఆరోగ్య సమస్యలేమీ లేవని ధ్రువీకరించారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.

ఇదీ చదవండి:మథురలో ఉత్సాహంగా 'లడ్డూమార్​ హోలీ'

ABOUT THE AUTHOR

...view details