Mother kills son:తన బిడ్డకు చిన్న దెబ్బతగిలినా తల్లి హృదయం తల్లడిల్లుతుంది. బిడ్డకు ఏదైనా ఆపదొస్తే ప్రాణాలర్పించైనా కాపాడాలనుకుంటుంది. కానీ, మహారాష్ట్రలో అమ్మతనానికి మచ్చతెచ్చే ఘటన ఒకటి వెలుగు చూసింది. ఓ తల్లి తన ఐదు నెలల మగ శిశువు మృతికి కారణమైంది. ఈ కేసులో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.
ఏం జరిగిందంటే..?
ఠాణె జిల్లా కల్వాలోని మహాత్మ పూలే నగర్ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం.. శుక్రవారం మధ్యాహ్నం తమ ఐదు నెలల బాలుడ్ని ఎవరో కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి శిశువు కోసం గాలింపు మొదలుపెట్టారు. అయితే.. శిశువు మృతదేహం ఆ ఇంటికి సమీపంలో ఉన్న ఓ ప్లాస్టిక్ నీళ్ల డ్రమ్ములో శనివారం ఉదయం కనిపించింది.
Baby body in water drum: "సీసీటీవీలో నమోదైన దృశ్యాలను మేం పరిశీలించాం. బాలుడి బంధువులు సహా ఇరుగుపొరుగువారిని ప్రశ్నించాం. ఈ క్రమంలో ఆ బాలుడు తరచూ అనారోగ్యానికి గురయ్యేవాడని, ప్రతిసారీ తల్లే మందులు ఇచ్చేదన్న విషయం మాకు తెలిసింది. శుక్రవారం కూడా ఆమె అనుకోకుండా తన కుమారుడికి అధిక డోసులతో ఉన్న మందులు ఇచ్చింది. దాంతో మందులు వికటించి.. బాలుడు మృతి చెందాడు" అని ఏసీపీ వెంకట్ అందలే తెలిపారు.