తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముగ్గురితో పెళ్లి.. అందుకు అడ్డొస్తున్నాడని కుమారుడిని హతమార్చిన తల్లి! - వివాహేతర సంబంధం వల్ల చిన్నారిని చంపిన కన్నతల్లి

mother killed her own child: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ ఏడాది వయసున్న కుమారుడి ప్రాణాలు తీసింది. ఈ ఘటన తమిళనాడులోని నీలగిరి జిల్లాలో జరిగింది.

Mother killed her own child
కన్న కుమార్తెను హత్యచేసిన తల్లి

By

Published : Mar 25, 2022, 11:01 PM IST

Updated : Mar 26, 2022, 6:55 PM IST

Mother killed her own child: వివాహేతర సంబంధాలతో కుటుంబాలు నాశనమవుతున్నాయి. సొంత వారినే కడతేరుస్తున్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. అలాంటి సంఘటనే తమిళనాడులోని నీలగిరి జిల్లాలో జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో.. ఏడాది వయసున్న కుమారుడిని హాతమార్చింది ఓ తల్లి.

ఇదీ జరిగింది: జిల్లాలోని ఉడగా​ ప్రాంతానికి చెందిన కార్తిక్​, గీత(38) దంపతులు. వారికి నితీశ్​(2), నితిన్​(1) వయసున్న ఇద్దరు బాబులు ఉన్నారు. ఇటీవల మనస్పర్థలతో దంపతులు వేరుగా ఉంటున్నారు. ఫిబ్రవరి 14న నితిన్​ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఉడగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే.. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. అయితే, చిన్నారి శరీరంపై ఎలాంటి గాయాలు కాకపోవటం, అనారోగ్య సమస్యలు లేకపోవటంపై అనుమానం వ్యక్తం చేసిన వైద్యులు ఊటీ బీ1 స్టేషన్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మృతదేహానికి పోస్ట్​మార్టం నిర్వహించగా నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. పసికందును తీవ్రంగా కొట్టి.. నోట్లో ఆహారం కుక్కటం సహా ఆల్కహాల్​ తాగించటం వల్ల ఊపిరాడకుండా చనిపోయినట్లు నివేదిక వచ్చింది.

హత్య కేసు నమోదు చేసుకుని నిందితురాలు గీతను ఊటీ బీ1 పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల దర్యాప్తులో చిన్నారి మృతిపై పలు దిగ్భ్రాంతికర విషయాలు బయటపడ్డాయి. 'గతంలో ఇద్దరిని వివాహం చేసుకుని వారి నుంచి విడిపోయి కార్తిక్​ను పెళ్లి చేసుకుందని, అతనితోనూ గొడవ పెట్టుకుని వేరుగా జీవిస్తున్నట్లు ఒప్పుకుంది. ఆ తర్వాత మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని పెళ్లి కూడా చేసుకుంది. అంతేకాకుండా సోషల్ మీడియా ద్వారా ఆమె అనేక అక్రమ వ్యవహారాలు సాగిస్తోంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో బిజీగా ఉండేది. అందుకే తన ఏడాది వయసున్న బిడ్డ తన జీవితానికి అడ్డంకిగా భావించింది. అందుకే తన బిడ్డను ఉద్దేశపూర్వకంగా చంపేసిందని' పోలీసుల విచారణలో తేలింది.

ఇదీ చదవండి:ప్రేయసిని హత్య చేసి సూట్​ కేసులో కుక్కి.. కొత్త డ్రామా!

Last Updated : Mar 26, 2022, 6:55 PM IST

ABOUT THE AUTHOR

...view details