తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భార్యాభర్తల గొడవ.. 3 నెలల చిన్నారి గొంతు నులిమి.. - కన్నతల్లి కర్కశత్వం

Mother killed Child: దిల్లీలో దారుణం జరిగింది. భార్యాభర్తల మధ్య విభేదాలు.. 3 నెలల చిన్నారిని బలిగొన్నాయి. భర్తపై కోపంతో కూతురి గొంతు నులిమి చంపింది మహిళ.

mother killed her 3 month old daughter after family dispute
mother killed her 3 month old daughter after family dispute

By

Published : Apr 14, 2022, 7:18 PM IST

Mother killed Child: భర్తపై కోపాన్ని అభంశుభం తెలియని చిన్నారిపై చూపింది ఓ మహిళ. క్షణికావేశంలో 3 నెలల సొంత కూతురి ప్రాణాలు తీసింది. అత్యంత దారుణమైన ఈ ఘటన దిల్లీ హైదర్​పుర్​లో గురువారం జరిగింది. కార్పెంటర్​ పని చేసే సంచిత్​ తన భార్యతో కలిసి హైదర్​పుర్​లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. వీరికి 3 నెలల కూతురు ఉంది. కొద్దిరోజులుగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే గురువారం కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అనంతరం సంచిత్​ పనిమీద బయటికి వెళ్లిన సమయంలో.. కూతురి గొంతు నులిమి హత్య చేసిందా మహిళ. కాసేపటికి ఘటనా స్థలానికి చేరుకున్న ఇంటి యజమాని.. పోలీసులకు సమాచారం అందించాడు.

ABOUT THE AUTHOR

...view details