Mother killed Children: రాజస్థాన్ చిత్తోర్‌గఢ్‌లో దారుణం జరిగింది. కపాసన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ తన ముగ్గురు పిల్లలను ఉరి తీసి చంపింది. ఆ తర్వాత తాను ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. అయితే మహిళ పిల్లలను ఎందుకు చంపి ఉంటుందనే విషయం తెలియాల్సి ఉంది. పోలీసులు మాత్రం కుటుంబ తగాదాల వల్లే మహిళ ఈ చర్యకు పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు.
కపాసన్ సీఐ ఫూల్‌చంద్ టేలర్ చెప్పిన వివరాల ప్రకారం.. ఆర్ఎన్టీ కోళ్ల ఫాంలో మృతురాలు రూప, ఆమె భర్త భూరాలాల్ ఏడేళ్లుగా పనిచేస్తున్నారు. బుధవారం అతను పని మీద బయటకు వెళ్లాడు. రాత్రి అయ్యాక తిరిగి వచ్చి చూస్తే భార్య, ముగ్గురు పిల్లలు తలో దిక్కు ఉరివేసుకుని విగతజీవులుగా కనిపించారు. వెంటనే భూరాలాల్ తన యజమానికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆ తర్వాత యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. వారు వచ్చి ఘటనా స్థలం నుంచి క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరించారు. భార్యాభర్తలు రత్లాంకు చెందిన వారని, పనికోసం వచ్చి కపాసన్లో నివసిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.