తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆడపిల్ల అని.. పసికందును హత్యచేసి 'ఒవెన్'​లో పెట్టిన తల్లి! - దిల్లీ నేర వార్తలు

Mother Killed Daughter: దిల్లీలోని మాలవీయ నగర్​లో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. రెండు నెలల వయసు ఉండే కన్నకూతుర్ని గొంతు నులిమి దారుణంగా హత్య చేసిందో తల్లి. ఆ తర్వాత చిన్నారి మృతదేహాన్ని ఒవెన్​లో పెట్టింది.

Mother Killed Daughter
పసికందును చంపిన తల్లి

By

Published : Mar 21, 2022, 8:50 PM IST

Mother Killed Daughter: కంటికిరెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే ఆ పసికందు పాలిట మృత్యువైంది. రెండు నెలల కుమార్తెను అతిదారుణంగా చంపిన తల్లి.. ఆ పసికందు మృతదేహాన్ని ఒవెన్​లో దాచింది. ఈ అమానవీయ ఘటన దక్షిణ దిల్లీ మాలవీయ నగర్​లోని చిరాగ్​ దిల్లీ ప్రాంతంలో సోమవారం జరిగింది.

"సాయంత్రం పొరుగింటి అబ్బాయి నిందితురాలి ఇంటికి వెళ్లాడు. ఎంత సేపు తలుపు కొట్టినా ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల అనుమానం వచ్చింది. పసికందు కూడా కనిపించలేదు. నిందితురాలు తలుపుకు తాళం వేసుకుంది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాము. చిన్నారి కోసం చుట్టుపక్కల ఎంత వెతికినా దొరకలేదు. చివరకి ఆ ఇంట్లోనే ఒవెన్​లో విగత జీవిగా కనిపించింది. ఆడపిల్ల పుట్టిందనే అక్కసుతో ఆమె ఈ పని చేసింది."

-స్థానికురాలు

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. చిన్నారిని నిందితురాలు గొంతు నులిమి చంపిందని వెల్లడించారు. ఈ హత్యలో ప్రధాన నిందితురాలితో పాటు వేరెవరైనా నిందితులు ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి :భుజాలపై కుమారుడి శవం.. గుండె నిండా దుఃఖం.. అర కిలోమీటరు నడుస్తూ...

ABOUT THE AUTHOR

...view details