మాతృత్వానికే మచ్చ తెచ్చేలా ప్రవర్తించింది మహారాష్ట్రకు చెందిన ఓ తల్లి. భర్తతో విభేదాలు ఉన్నాయన్న కారణంతో కన్న బిడ్డనే గొంతు నులిమి హత్య చేసింది. అనంతరం చిన్నారి మృతదేహాన్ని సమీపంలోని పొలంలో ఉన్న ఓ బావిలో పడేసింది. తరువాత ఏమీ తెలియనట్లుగా నాటకాలు ఆడింది. ఎవరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తన బిడ్డను అపహరించుకు పోయారని బంధువులకు సమాచారం ఇచ్చింది. కాగా, దుండగుల కోసం వెతకగా ఆచూకీ లభించలేదు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బంధువులు.
ఐదు నెలల పసికందును హత్య చేసిన తల్లి.. మృతదేహాన్ని బావిలో పడేసి నాటకం - Mother killed baby in maharashtra
కన్నతల్లే ఐదు నెలల పసికందును గొంతు నులిమి చంపి బావిలో పడేసింది. అనంతరం తన బిడ్డను గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి కిడ్నాప్ చేసినట్లుగా పోలీసుల ముందు బుకాయించింది. తల్లిపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. తానే హత్య చేసినట్లుగా నేరాన్ని అంగీకరించింది. ఈ అమానవీయ ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది.
పోలీసుల వివరాల ప్రకారం.. మహారాష్ట్ర అహ్మద్‌నగర్ జిల్లాలోని కర్వాడి గ్రామంలో సూరజ్ శంకర్ మాలీ, గాయత్రి మాలీ అనే దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఐదు నెలల శివమ్ అనే కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలో భార్య గాయత్రి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త అనుమానించేవాడు. ఇదే విషయంపై ఇద్దరి మధ్య తరచూ రోజు గొడవలు జరిగేవి.
దంపతుల మధ్య గొడవలు తీవ్రం కాగా.. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసి గాయత్రి(తల్లి) చిన్నారి గొంతు నులిమి పక్కనే పొలంలోని ఓ బావిలో పడేసింది. అనంతరం నిందితురాలు తన బంధువులకు ఇద్దరు దుండగులు వచ్చి కుమారుడిని అపహరించుకొని పోయినట్లుగా నమ్మించింది. చిన్నారి ఆచూకీ లభించకపోవడం వల్ల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు బంధువులు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు తల్లిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. చివరకూ తానే క్షణికావేశంలో బిడ్డను కొట్టి గొంతు నులిమి చంపినట్లుగా పోలీసులు ముందు నేరాన్ని అంగీకరించింది. ఈ ఘటనపై భర్త ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితురాలిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లుగా శిర్డీ డిప్యూటీ ఎస్పీ సంజయ్ సాతవ్ తెలిపారు.