కుమార్తెను బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టిన తల్లికి మద్రాస్ హైకోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. చెన్నైకు చెందిన ఈ మహిళ.. డబ్బు సంపాదన కోసం మైనర్ అయిన తన కుమార్తెను వ్యభిచారం చేయమని బలవంతం చేసింది. దీంతో ఆ బాలిక తల్లి చెర నుంచి తప్పించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ చేరుకుంది. బాలిక గురించి ఆరా తీసిన ఏపీ పోలీసులు ఆమెను చెన్నైకు తరలించారు.
కుమార్తెను వ్యభిచారం చేయమని బలవంతం.. తల్లికి 10ఏళ్ల జైలు శిక్ష
డబ్బు కోసం కూతురిని బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టిన తల్లికి ప్రత్యేక కోర్టు విధించిన 10 ఏళ్ల జైలు శిక్షను మద్రాస్ హైకోర్టు సమర్థించింది. నిందితురాలికి వ్యతిరేకంగా అన్ని ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది.
కుమార్తెను వ్యభిచారం చేయమని బలవంతం.. తల్లికి 10ఏళ్ల జైలు శిక్ష
బాధితురాలి ఫిర్యాదు మేరకు చెన్నై పోలీసులు ఆమె తల్లి సహా మరో తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితురాలైన బాలిక తల్లిని విచారించిన పోక్సో ప్రత్యేక కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఇటీవల తీర్పును ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ నిందితురాలు హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ప్రత్యేక కోర్టు తీర్పును సమర్థించింది. ఆమెకు వ్యతిరేకంగా అన్ని ఆధారాలు ఉన్నాయని పేర్కొంది.
ఇదీ చూడండి :అమ్మ సెల్ఫోన్ తీసేసుకుందని విద్యార్థిని ఆత్మహత్య