Mother Gave Drug Injections to Her Daughter: సినిమా ప్రపంచంపై ఉన్న మక్కువతో ఓ తల్లి.. తన కుమార్తెను హీరోయిన్ను చేయాలని అనుకుంది. అంతవరకూ బాగానే ఉంది. అయితే కుమార్తె వయసు చిన్నది కావటంతో.. ఆమెకు డ్రగ్ ఇంజక్షన్లు ఇచ్చి త్వరగా పెద్దదాన్ని చేసేయాలని అనుకుంది. బాలికను త్వరగా పెద్దదాన్ని చేసేందుకు డ్రగ్ ఇంజక్షన్లు ఇవ్వటం మొదలు పెట్టింది. బాధ భరించలేని కూతురు వద్దంటూ.. తల్లిని ఎంత వేడుకున్నా.. విడిచిపెట్టేదికాదు. దీంతోపాటు ఆ బాలికను వ్యభిచార కూపంలోకి కూడా దించి.. కన్నబిడ్డతో వ్యాపారం చేయాలని అనుకుంది. బాలిక అందుకు సహకరించపోవటంతో చిత్రహింసలకు గురిచేసేది. ఈ హృదయవిదారక ఘటన విజయనగరంలో వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..?
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. విజయనగరంలోని తోటపాలెం దగ్గరలో ఓ వివాహిత(40) నివాముంటోంది. ఆమెకు ఒక కుమార్తె పుట్టిన తర్వాత.. భర్త చనిపోయాడు. దీంతో ఆ మహిళ మరో వ్యక్తిని వివాహమాడింది. రెండో భర్తతో ఆమెకు ఇద్దరు పిల్లలు పుట్టారు. అయితే ఆమె ప్రవర్తన నచ్చకపోవటంతో రెండో భర్త.. తన ఇద్దరు బిడ్డలను తీసుకుని వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఆ మహిళ మరో వ్యక్తితో కలిసి సహజీవనం చేస్తోంది.
దిల్లీలో 'కేరళ స్టోరీ'.. ప్రేమగా దగ్గరై రేప్.. మతం మార్చి వివాహం.. 11 ఏళ్ల తర్వాత..
ఇదిలా ఉండగా.. ఆ మహిళ మొదటి భర్తకు పుట్టిన కుమార్తె(15) విశాఖలోని ప్రభుత్వ విద్యాసంస్థలో ఇటీవల పదో తరగతి పూర్తి చేసుకుంది. వేసవి సెలవులు కావడంతో బాధిత బాలిక తన తల్లి దగ్గరకు వచ్చింది. అయితే తరచుగా వారి ఇంటికి ఎవరెవరో వచ్చిపోతుండేవారు. వారిలో ఓ వ్యక్తి ఆ బాలికను చూసి.. ఆమెకు హీరోయిన్ అయ్యే లక్షణాలు ఉన్నాయని ఆమె తల్లితో చెప్పాడు. అయితే బాలిక వయస్సు చిన్నది కావటంతో.. ఆమె అవయవాలు త్వరగా పెరుగుదల అయ్యేందుకు.. డ్రగ్ ఇంజక్షన్లు ఇవ్వాలని సూచించాడు.