PUBG Addiction: కుమారుడి పబ్జీ పిచ్చి తల్లి ప్రాణాలు కోల్పోయేలా చేసింది. పబ్జీ ఆడుతున్న కొడుకును భర్త కొడుతుండగా అడ్డుకోబోయిన మహిళ తన ప్రాణాలను కోల్పోయింది. ఇంతియాజ్, మైమున దంపతులు కర్ణాటక చిక్కమగళూరు తాలుకాలోని హగలఖాన్ ఎస్టేట్‌లో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నాడు. పబ్జీకి బానిసైన చిన్న కుమారుడు అదే పనిగా ఆడుతుండేవాడు. దీంతో పబ్జీ ఆడొద్దంటూ కొడుకును మందలించాడు తండ్రి.
కుమారుడి పబ్జీ ఆటకు తల్లి బలి! - పబ్జీ గేమ్ న్యూస్
PUBG Addiction: పబ్జీ.. దీనికి బానిసై అనేక మంది పిల్లలు ప్రాణాలు కోల్పోగా.. ఎన్నో కుటుంబాల మధ్య చిచ్చు పెడుతోంది. తాజాగా ఓ ఇంట్లో విషాదాన్ని నింపింది. పబ్జీ ఆడుతున్న కొడుకును భర్త కొడుతుండగా.. అడ్డుకోబోయిన ఆ తల్లి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.
ఇదే విషయమై తండ్రీకొడుకుల మధ్య వివాదం తలెత్తింది. కోపంతో ఉన్న ఇంతియాజ్.. కుమారుడిని చంపేస్తానంటూ తుపాకీ పట్టుకున్నాడు. తన కొడుకును చంపుతాడనే భయంతో భర్తను అడ్డుకోబోయింది మైమున. మద్యం మత్తులో ఉన్న ఇంతియాజ్ తుపాకీతో కాల్చడం వల్ల మైమునకు బుల్లెట్ తగిలింది. వెంటనే పెద్ద కుమారుడు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:'మెక్‌డీ' కూల్‌డ్రింక్‌లో బల్లి.. అడిగితే నవ్వుతూ బెదిరింపులు.. చివరకు..