తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తల్లీకూతుళ్లపై సామూహిక అత్యాచారం.. భర్తను మంచానికి కట్టేసి దారుణం

ఓ మహిళను ఆమె మైనర్ కూతురిని అత్యాచారం చేశారు ముగ్గురు దుండగులు. మహిళ భర్తను మంచానికి కట్టేసి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఉత్తర్​ప్రదేశ్​లో ఈ ఘటన జరిగింది. మరోవైపు ఒకే కుటుంబంలో ముగ్గురిని హత్యచేశారు గుర్తుతెలియని వ్యక్తులు. రిటైర్డ్​ ఎస్​ఐ కుటుంబంపై ఈ దారుణానికి పాల్పడ్డారు. పంజాబ్​లో ఈ ఘటన జరిగింది.

mother-daughter-gang-raped-in-uttar-pradesh-and-ritered-si-family-murdered-in-punjab
తల్లికూతుళ్లపై సామూహిక అత్యాచారం

By

Published : May 22, 2023, 11:42 AM IST

మెకానిక్​ను మంచానికి కట్టేసి.. అతని భార్య, మైనర్​ కూతురిపై సామూహిక అత్యాచారం చేశారు దుండగులు. నిందితులు దొంగతనం కోసం వచ్చి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఉత్తర్​ప్రదేశ్​లో ఈ ఘటన జరిగింది. మొదట నిందితులపై దొంగతనం కేసు పెట్టిన బాధితులు.. పోలీసుల విచారణలో అత్యాచారం కూడా చేశారని వెల్లడించారు. శనివారం రాత్రి రామ్​పుర్​ జిల్లాలో ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సైఫాని పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే ఓ పంక్చర్​ మెకానిక్​ భార్యపై, మైనర్​ కూతురిపై ఈ అత్యాచారం జరిగింది. మొదట దుండగులపై దొంగతనం కేసు పెట్టాడు పంక్చర్ మెకానిక్​. తన ఇంట్లోకి ముగ్గురు వ్యక్తులు ప్రవేశించి.. రూ.5 వేలతో పాటు ఓ మొబైల్​ కూడా చోరీ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే దొంగతనంపై.. పోలీసులకు సరైన సమధానాలు అందించలేదు మెకానిక్. దీంతో మెకానిక్​ను వివిధ కోణాల్లో పోలీసులు ప్రశ్నలు అడగ్గా.. అత్యాచార విషయాన్ని పోలీసులకు వివరించాడు మెకానిక్.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వెంటనే బాధితుల ఇంటికి చేరుకున్నారు. అనంతరం అత్యాచారానకి గురైన మహిళను, ఆమె కూతురిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని పోలీసులు వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం​ కొందరు వ్యక్తులతో మెకానిక్ గొడవ పడ్డాడనే విషయం తమకు తెలిసిందన్న పోలీసులు.. వారే ఈ ఘాతూకానికి పాల్పడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఒకే కుటుంబంలో ముగ్గురు హత్య.. రిటైర్డ్​ ఎస్​ఐతో పాటు..
రిటైర్డ్​ ఎస్​ఐని, అతని భార్య, కొడుకుని దారుణంగా హత్య చేశారు గుర్తుతెలియని వ్యక్తులు. పంజాబ్​లోని లూధియానాలో ఈ దారుణం జరిగింది. దుండగులు బాధితుల తలను ఇనుప రాడ్​తో బలంగా కొట్టి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2019లో ఎస్​ఐగా పదవి విరమణ చేసిన కుల్​దీప్​ సింగ్​ అనే వ్యక్తి.. తన కుటుంబ సభ్యులతో కలిసి లాధోవల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నూర్పూర్ బెట్​ గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఆదివారం కుల్​దీప్​ సింగ్ ఇంటికి వచ్చిన దుండగులు.. తలుపులు పగులగ్గొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం కుటుంబంలోని ముగ్గురిని హత్య చేశారు.

ఈ మధ్యకాలంలోనే కుల్​దీప్​ సింగ్​ కుమారుడికి వివాహం జరిగింది. అయితే ఘటన జరిగిన సమయంలో కుల్​దీప్​ సింగ్ కోడలు.. వాళ్ల పుట్టింటికి వెళ్లడం వల్ల ఆమె తప్పించుకోగలిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్​మార్టం పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని పోలీసులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details