తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తల్లీకూతుళ్ల స్మగ్లింగ్ దందా- రూ. 25 కోట్ల హెరాయిన్ తీసుకొస్తూ... - ముంబయి ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం

విదేశాల నుంచి భారత్​కు అక్రమంగా మాదకద్రవ్యాలు తరలిస్తున్న తల్లీకూతుళ్లను అరెస్టు చేశారు కస్టమ్స్​ అధికారులు. రూ. 25 కోట్ల విలువైన హెరాయిన్​ను స్వాధీనం చేసుకున్నారు.

Mother-daughter duo from overseas held with Rs 25 cr heroin
హెరాయిన్ సీజ్​​- తల్లీకూతుళ్ల అరెస్ట్

By

Published : Sep 22, 2021, 6:40 PM IST

ముంబయి ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో.. ఇద్దరు విదేశీ మహిళలను అరెస్టు చేశారు కస్టమ్స్​ అధికారులు. సుమారు 5 కేజీల హెరాయిన్​ను.. అక్రమంగా దేశంలోకి తరలిస్తుండగా పట్టుకున్నారు. దీని విలువ రూ. 25 కోట్లపైమాటే. నిందితులు తల్లీకూతుళ్లు కావడం గమనార్హం.

ఇద్దరు మహిళలు.. ఖతార్​ ఎయిర్​లైన్స్​ ఫ్లైట్​లో దోహా మీదుగా జోహన్నెస్​బర్గ్​ నుంచి ఆదివారం ముంబయి చేరుకున్నారు. ఆ సమయంలోనే వారు తీసుకొస్తున్న ట్రాలీ బ్యాగుల్లో నిషేధిత పదార్థం దాగి ఉన్నట్లు గుర్తించారు అధికారులు. అయితే.. నిందితులు ఏ దేశానికి చెందినవారో తెలియరాలేదు.

ఊపిరితిత్తుల క్యాన్సర్​కు చికిత్స పొందాలనే నెపంతో.. భారత్​కు వచ్చారని అధికారులు తెలిపారు.

అతని కోసం గాలింపు..

ఈ మత్తుపదార్థాలను ముంబయిలోని ఓ హోటల్​లో ఒకరికి ఇవ్వాల్సి ఉందని, అందుకు ప్రతిఫలంగా తమకు భారీగా డబ్బు ముట్టనున్నట్లు విచారణలో ఒప్పుకున్నారు నిందితులు.

ఆ వ్యక్తి ఎవరో తెలుసుకునే పనిలో ఉన్నారు అధికారులు. వీరిని కోర్టులో హాజరుపరిచి.. 14 రోజుల రిమాండ్​ కోరనున్నట్లు తెలిపారు.

ఇవీ చూడండి: 'విజయవాడ డ్రగ్స్​ విలువ రూ.9 వేల కోట్లు కాదు.. 21వేల కోట్లు!'

Money Laundering Case News: ఈడీ విచారణకు హాజరైన నటుడు తరుణ్

ABOUT THE AUTHOR

...view details