తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Viral Video: పిల్లల్ని కిరాతకంగా చితకబాదిన తల్లి

పిల్లలు అల్లరి పనులు చేస్తుంటారు. అమ్మకు విపరీతంగా విసుగు తెప్పిస్తుంటారు. అయినా.. సహనంతో వ్యవహరిస్తూ, కన్నబిడ్డలను సరైనదారిలో నడిపిస్తుంది అమ్మ. కానీ అమ్మతనానికే (mother beats child news) మచ్చ తెచ్చే సంఘటన తాజాగా దిల్లీలో జరిగింది. విచక్షణ కోల్పోయిన తల్లి పసిపిల్లల్ని చితకబాదిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కాగా.. అవి వైరల్​గా మారాయి.

mother beats child
పిల్లల్ని చితకబాదిన తల్లి

By

Published : Nov 4, 2021, 12:23 PM IST

పిల్లల్ని చితకబాదిన తల్లి

తల్లి ప్రేమ అమరం. పిల్లల్ని తల్లి ఇష్టపడినంతగా ఎవరూ ఇష్టపడరు. పిల్లల కోసం ఎన్ని కష్టాల్నైనా ఓర్చుకుంటుంది అమ్మ. కానీ ప్రస్తుత సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు అమ్మతనానికి మచ్చతెస్తున్నాయి. ఇలాంటి సంఘటనే తాజాగా దిల్లీలో జరిగింది. విచక్షణ కోల్పోయి కన్నబిడ్డలనే (mother beats child news) చితకబాదింది ఓ తల్లి.

పిల్లల్ని తల్లి విపరీతంగా కొడుతున్న దృశ్యాలు సీసీటీవీలో నిక్షిప్తమయ్యాయి. వాటిని బాలల హక్కుల కమిషన్​కి నిందితురాలు భర్త అందించగా.. విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో ఎనిమిదేళ్లు, రెండేళ్ల వయసుగల ఇద్దరు పిల్లల్ని తల్లి కొడుతుండగా.. వారి నానమ్మ రక్షించే ప్రయత్నం చేసింది. ఆమెను దూషిస్తూ పిల్లలపై నిందితురాలు విరుచుకుపడింది. తన భార్య నుంచి తన తల్లికి ప్రాణహాని ఉందని నిందితురాలు భర్త ఆరోపించాడు.

"పిల్లలను తల్లి కొట్టిన తీరు నన్ను చాలా బాధపెట్టింది. కన్నబిడ్డలనే కర్కశంగా చితకబాదింది. ఈ విషయంలో దిల్లీ పోలీసులు కఠినంగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా."

-స్వాతి మలివాల్​, మహిళా కమిషన్ చీఫ్​

ఆ మహిళ కర్కశత్వాన్ని చూసిన కమిషన్ నిర్ఘాంతపోయింది. పిల్లల్ని బాలల సంరక్షణ కమిటీ ముందు హాజరుపరచాలని పోలీసులకు ఆదేశించింది. అలాగే.. ఆ తల్లిని అరెస్టు చేయాలని నోటీసులు జారీ చేసింది.

ఇదీ చదవండి:నాలుగేళ్ల చిన్నారిని సజీవ దహనం చేసిన కిరాతకుడు

ABOUT THE AUTHOR

...view details