తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తల్లీకూతుళ్లపై పెట్రోల్​ పోసి నిప్పు.. ఇద్దరు మృతి.. గర్భిణీ టీచర్​పై విద్యార్థుల దాడి - గర్భిణీ టీచర్​పై విద్యార్థుల దాడి

అత్యాచారానికి యత్నించగా తిరగబడినందుకు.. ఇంటిపై పెట్రోల్​ పోసి నిప్పంటించాడు ఓ దుండగుడు. ఈ ఘటనలో తల్లీకూతుళ్లు సజీవ దహనమయ్యారు. బిహార్​ అల్వార్​లో దారుణం జరిగింది. అసోంలో జరిగిన మరో ఘటనలో ఐదునెలల గర్భిణి అయిన టీచర్​పై దాడిచేశారు విద్యార్థులు.

mother and daughter burnt alive to death
mother and daughter burnt alive to death

By

Published : Nov 29, 2022, 7:14 PM IST

Updated : Nov 29, 2022, 7:43 PM IST

బిహార్​ అల్వార్​లో దారుణం జరిగింది. అత్యాచారానికి యత్నించగా తిరగబడినందుకు.. ఇంటిపై పెట్రోల్​ పోసి నిప్పంటించాడు ఓ దుండగుడు. ఈ ఘటనలో తల్లీకూతుళ్లు సజీవ దహనమయ్యారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

మృతురాలి భర్త అజిత్ పాసవాన్​ ఐదు రోజుల కింద మద్యం విక్రయం కేసులో అరెస్టయ్యాడు. దీంతో ఇంట్లో తల్లి, కూతురు మాత్రమే ఉన్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న నిందితుడు నందకుమార్​ సోమవారం రాత్రి ఇంట్లోకి ప్రవేశించాడు. మహిళపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. వారు ప్రతిఘటించడం వల్ల ఆగ్రహించిన నిందితుడు.. ఇంటికి వెళ్లి పెట్రోల్​ తీసుకు వచ్చాడు. బాధితుల ఇంటిపై పోసి నిప్పంటించాడు. వారు బయటకు రాకుండా తలుపులు మూసి ఈ కిరాతకానికి పాల్పడ్డాడు. దీనిని గమనించిన స్థానికులు తల్లీకూతుళ్లను రక్షించి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడం వల్ల పట్నాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ మరణించారు.

గర్భిణీ టీచర్​పై విద్యార్థుల దాడి
ఐదునెలల గర్భిణి అయిన టీచర్​పై దాడిచేశారు విద్యార్థులు. ఈ అమానవీయ ఘటన అసోంలోని దిబ్రూగఢ్​ జేఎన్​వీ పాఠశాలలో జరిగింది. పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని తల్లిదండ్రులకు చెప్పడం వల్ల టీచర్​ను కొట్టారు. 9-12 తరగతి విద్యార్థులు 22 మంది ఈ దాడికి పాల్పడ్డారని ప్రిన్సిపల్​ తెలిపారు. విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

నవంబర్​ 27 న పేరెంట్- టీచర్​ మీటింగ్​ జరగగా.. పిల్లలకు మార్కులు తక్కువ వచ్చాయని, నిబంధనలు పాటించకుండా పాఠశాలలో అసభ్యకరంగా ప్రవర్తిసున్నారని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది టీచర్​ అంజు రాణి. దీంతో కోపం పెంచుకున్న విద్యార్థులు.. టీచర్​పై మూకుమ్మడిగా దాడి చేశారు. సహచర ఉపాధ్యాయులు, విద్యార్థులు.. అంజు రాణిని రక్షించారు.

యువతిపై అత్యాచారం.. నిందితులకు మరో అమ్మాయి హెల్ప్
కర్ణాటక బెంగళూరులో దారుణం జరిగింది. కేరళకు చెందిన ఓ యువతిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అత్యాచారానికి ఓ నిందితుడి గర్ల్​ఫ్రెండ్​ సైతం సహకారం అందించింది.

బెంగళూరులోని ఓ సంస్థలో పనిచేస్తున్న బాధితురాలు.. విధులు ముగిశాక మద్యం తాగి ఇంటికి బయలుదేరింది. మత్తులో ఉన్న బాధితురాలిని ఇంట్లో దించుతామంటూ నమ్మించి ఎత్తుకెళ్లారు నిందితులు. అనంతరం ఆమెపై అత్యాచారం చేయగా.. మరో యువతి వారికి సహకరించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

మామ చెవిని కొరికిన అల్లుడు
బిహార్​ వైశాలిలో ఓ వింత ఘటన జరిగింది. మామ చెవినే కొరికేశాడు ఓ అల్లుడు. ఓ విషయంలో మామ, అల్లుడు మధ్య వివాదం తలెత్తింది. ఇద్దరు ఒకరిని ఒకరి దూషించుకున్నారు. ఈ క్రమంలోనే ఆగ్రహించిన అల్లుడు.. మామ మునేశ్వర్​ ఠాకూర్​ చెవిని కొరికాడు. గాయపడిన ఠాకూర్​ను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతున్నాడు.

పదేళ్ల బాలికపై హత్యాచారం
ఇంటి పక్కన నివసించే పదేళ్ల బాలికపై హత్యాచారానికి పాల్పడ్డాడు ఓ మైనర్​. ఈ దారుణ ఘటన ఛత్తీస్​గఢ్​లో జరిగింది. శనివారం బాధితురాలు ఇంట్లో అనుమానాస్పదంగా ఉరివేసుకుని కనిపించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణలో బాలిక లైంగిక దాడికి గురైనట్లు తేలింది. అనంతరం స్థానికులను విచారించగా.. నిందితుడు పట్టుబడ్డాడు. మొబైల్​లో పోర్న్​ చిత్రాలు చూడడమే.. ఈ హత్యాచారానికి పాల్పడేలా ప్రేరేపించిందని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:పక్కింటిపై కోపం.. మాంసం, గుడ్డు పెంకులు వేసి వేధింపులు.. చివరకు జైలులో..

అఫ్తాబ్ నార్కో టెస్టుకు కోర్టు అనుమతి.. డీఎన్​ఏ రిపోర్ట్ ఆలస్యంపై అనుమానాలు!

Last Updated : Nov 29, 2022, 7:43 PM IST

ABOUT THE AUTHOR

...view details