తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా కట్టడికి రాష్ట్రాల 'లాక్​డౌన్' అస్త్రం

కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్​డౌన్ విధించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అయితే, దేశంలోని చాలా రాష్ట్రాలు ఇప్పటికే లాక్​డౌన్ లేదా ఆ తరహా ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ఏఏ రాష్ట్రాల్లో లాక్​డౌన్​, ఆంక్షలు అమలవుతున్నాయంటే..?

most of the states announced lockdown to control the covid-19
కరోనా కట్టడికి రాష్ట్రాల లాక్​డౌన్ అస్త్రం

By

Published : May 8, 2021, 3:45 PM IST

Updated : May 8, 2021, 4:16 PM IST

కరోనా రెండో దశ ఉద్ధృతికి అడ్డుకట్ట వేసేందుకు దేశవ్యాప్తంగా కఠిన లాక్​డౌన్ విధించాలన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో.. ఇప్పటికే భారతావనిలోని చాలా ప్రాంతం ఆ తరహా వాతావరణంలోకి జారుకుంది.

ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రకటించిన కఠిన ఆంక్షలను ఓ మారు పరిశీలిస్తే..

  • దిల్లీ గత నెల 19 నుంచి లాక్​డౌన్​లో ఉంది. ఈ నెల 10 వరకు అక్కడే ఇదే పరిస్థితి.
  • హరియాణాలో ఈ నెల మూడో తేదీ నుంచి ఏడు రోజుల లాక్​డౌన్ అమల్లోకి వచ్చింది.
  • కర్ణాటకలో మే 10 నుంచి 24 వరకు సంపూర్ణ లాక్​డౌన్​ ప్రకటించారు సీఎం యడియూరప్ప.
  • తమిళనాడులోనూ మే 10 నుంచి 24 వరకూ పూర్తి లాక్​డౌన్​ అమలు చేయనున్నట్లు నూతన సీఎం ఎంకే స్టాలిన్ ప్రకటించారు.
  • కేరళ మే 8 నుంచి 16 వరకు లాక్​డౌన్ విధిస్తున్నట్లు సీఎం పినరయి విజయన్ ప్రకటించారు.
  • ఒడిశాలో ఈ నెల 5 నుంచి 19 వరకు 14 రోజుల పాటు సంపూర్ణ లాక్​డౌన్ అమలు చేస్తున్నారు.
  • రాజస్థాన్​లో ఈ నెల 17 వరకు లాక్​డౌన్ తరహా ఆంక్షలు అమలు చేస్తున్నారు.
  • ఝార్ఖండ్​లో గత నెల 22 నుంచి మే 8 వరకు లాక్​డౌన్ తరహా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.
  • ఛత్తీస్​గఢ్​లో లాక్​డౌన్​ను మే 15 వరకు పొడిగించారు.
  • పంజాబ్​లో వారాంతపు లాక్​డౌన్, రాత్రిపూట కర్ఫ్యూ వంటివి ఈ నెల 15 వరకు అమల్లో ఉండనున్నాయి.
  • మధ్యప్రదేశ్ ఈ నెల 15 వరకు జనతా కర్ఫ్యూ అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
  • గుజరాత్​లోని 29 నగరాల్లో రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.
  • మహారాష్ట్ర ప్రభుత్వం లాక్​డౌన్ ఆంక్షలను ఈ నెల 15 వరకు పొడిగించింది.
  • పుదుచ్చేరిలో ఈ నెల 10 వరకు లాక్​డౌన్ అమల్లో ఉండనుంది.
  • బంగాల్ ప్రభుత్వం లాక్​డౌన్ తరహా ఆంక్షలు విధించింది.
  • అసోం ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తోంది.
  • నాగాలాండ్​లో గత నెల 30 నుంచి ఈ నెల 14 వరకు పాక్షిక లాక్​డౌన్ అమలు చేస్తున్నారు.
  • ఉత్తరాఖండ్ రాత్రిపూట కర్ఫ్యూని మళ్లీ అమలు చేస్తోంది.
  • గోవాలో మే 9 నుంచి 23 వరకు కర్ఫ్యూ విధించింది ప్రభుత్వం.
Last Updated : May 8, 2021, 4:16 PM IST

ABOUT THE AUTHOR

...view details