తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'లఖింపుర్'​ ఘటనపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు - lakhimpur violence incident

తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని(lakhimpur violence news), దర్యాప్తు సంస్థల ఎదుట హాజరయ్యేందుకు సిద్ధమని.. లఖింపుర్​ హింసాత్మక ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర సహాయ మంత్రి అజయ్​ మిశ్రా వెల్లడించారు. ఆయన కుమారుడు(ajay mishra teni son) ఆశిష్​ మిశ్రాపై ఇప్పటికే ఎఫ్​ఐఆర్​ నమోదైంది.(lakhimpur violence incident)

lakhimpur violence
లఖింపుర్​

By

Published : Oct 5, 2021, 5:17 PM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపుర్​ హింసాత్మక ఘటనపై(lakhimpur violence news) స్పందించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్​ మిశ్రా. దర్యాప్తు సంస్థల ఎదుట హాజరయ్యేందుకు తన కుమారుడు ఆశిష్​ మిశ్రా సిద్ధమని వెల్లడించారు.(ajay mishra teni son)

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్​ మిశ్రా

"ఘటనపై ఎఫ్​ఐఆర్​ నమోదైంది. మన దేశంలో ఫిర్యాదు చేసే హక్కు అందరికీ ఉంది. ఆధారాల సేకరణలో వాస్తవాలు బయటపడతాయి. దర్యాప్తు చేసే వారు.. మా ఫోన్​ రికార్డులు, మొబైల్​ ఫోన్​ లొకేషన్లు అన్ని చెక్​ చేసుకోవచ్చు. అప్పుడు ఘటనాస్థలంలో నా కుమారుడు లేడన్న విషయం తెలిసి వస్తుంది. దర్యాప్తు సంస్థల ఎదుట హాజరయ్యేందుకు నా కుమారుడు సిద్ధం."

--- అజయ్​ మిశ్రా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి.

హింసాత్మక ఘటనకు సంబంధించి బయటకొచ్చిన వీడియోపైనా(lakhimpur violence video) మిశ్రా స్పందించారు. "రైతులపైకి కారు నడిపిన వ్యక్తిని కొట్టి చంపేశారు. అంటే.. నా కుమారుడు నిజంగా అక్కడ ఉండి ఉంటే అదే జరిగేది కదా. కానీ అలా జరగలేదు." అని తెలిపారు.

'నేరస్థులను కఠినంగా శిక్షించాలి...'

హింసాత్మక ఘటనపై భాజపా ఎంపీ వరుణ్​ గాంధీ స్పందించారు. ఘటనకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేసి.. 'రైతులపైకి కారు దూసుకెళ్లిన దృశ్యాలు చూస్తే ఎవరికైనా బాధ కలుగుతుంది. ఈ వీడియోను చూసి వాహన యజమాని, అందులోని సభ్యులు, ఘటనతో సంబంధం ఉన్న వారిపై పోలీసులు చర్యలు చేపట్టాలి.' అని డిమాండ్​ చేశారు.

చల్లారని.. రాజకీయ వేడి

హింసాత్మక ఘటనపై ఉత్తర్​ప్రదేశ్​లో నిరసనలు కొనసాగుతున్నాయి. ల‌ఖ్‌నవూ విమానాశ్రయంలో ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌(bhupesh baghel news) ధ‌ర్నా చేప‌ట్టారు. ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో నేలపై కూర్చుని పోలీసుల ప్రవర్తనపై నిర‌స‌న తెలిపారు. ల‌ఖింపుర్‌ ఘ‌ట‌న‌ను ఖండిస్తూ బఘేల్‌.. యూపీ ప‌ర్యట‌న‌ చేపట్టారు. త‌నను విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నట్లు ఆరోపించారు. ల‌ఖింపుర్‌లో కారు దూసుకెళ్లడం వల్ల న‌లుగురు రైతులు మరణించిన ఘ‌ట‌న‌ను నిర‌సిస్తూ ఆందోళ‌న చేప‌ట్టిన ప్రియాంకా గాంధీని(priyanka gandhi news) క‌లిసేందుకు వెళ్తున్నట్లు సీఎం తెలిపారు. కానీ లఖ్‌నవూ పోలీసులు మాత్రం సీఎంకు అనుమతి ఇవ్వలేదు. పోలీసుల‌తో సంభాషించే వీడియోను భూపేశ్ త‌న ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

ఇదీ చూడండి:-ఇంకా నిర్బంధంలోనే ప్రియాంక- కాంగ్రెస్ కార్యకర్తల తీవ్ర నిరసన

లఖింపుర్​లో అంతా ప్రశాంతం!

లఖింపుర్​లో రెండు రోజుల అనంతరం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్ల మీద ట్రాఫిక్​ కనిపించింది. దుకాణాలు తెరుచుకున్నాయి. పిల్లలు స్కూళ్లకు వెళ్లడం మొదలుపెట్టారు.

కాగా.. ఆ ప్రాంతంలో 144 సెక్షన్​ ఇంకా అమల్లో ఉంది. అంతర్జాల సేవలపై నిషేధం కొనసాగుతోంది.

ఇదీ జరిగింది..

ఉత్తర్​ప్రదేశ్​ లఖింపుర్​ ఖేరీలో ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన నేపథ్యంలో ఆదివారం ఆ ప్రాంతంలో హింస చెలరేగింది. లఖింపుర్‌ ఖేరీ జిల్లా టికునియా-బన్​బీర్​పుర్​ సరిహద్దు వద్ద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులు, అధికార వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. తమపై మంత్రుల కాన్వాయ్‌ దూసుకెళ్లిందని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు.

ఈ ఘటన అనంతరం ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. ఆగ్రహంతో రైతులు మూడు వాహనాలను తగలబెట్టారు. శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు రంగంలోకి దిగిన పోలీసులు లాఠీఛార్జి చేయటం వల్ల పరిస్థితి మరింత విషమించింది. ఈ ఘర్షణలో మరో నలుగురు చనిపోయారు. మొత్తంగా నలుగురు రైతులు సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి:-'లఖింపుర్ హింస' ఎన్నికల్లో భాజపాను దెబ్బకొడుతుందా?

ABOUT THE AUTHOR

...view details