తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బైక్‌పై చిన్నారులను తీసుకెళ్తున్నారా? ఇవి తప్పనిసరి! - central motor vehicle rules

బైక్​పై చిన్న పిల్లలతో వెళ్తున్నారా? అయితే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. కొత్త నిబంధనలతో ఓ ముసాయిదా విడుదల చేసింది రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ. నాలుగేళ్లలోపు చిన్నారులను తీసుకెళ్లేటప్పుడు బైక్​ వేగం 40 కి.మీ. మించకూడదని స్పష్టం చేసింది.

By

Published : Oct 26, 2021, 1:51 PM IST

ద్విచక్ర వాహనంలో వెనుక సీట్లో నాలుగేళ్లలోపు పిల్లల్ని కూర్చొబెట్టుకొని తీసుకెళ్లేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర రహదారి, రవాణాశాఖ సూచించింది. దీనికోసం కొత్త నిబంధనలు రూపొందించి వాటి ముసాయిదాను సోమవారం విడుదల చేసింది. వీటిపై సలహాలు, సూచనలను ఆహ్వానించింది. నిబంధనలు ఖరారైన తర్వాత ఏడాది నుంచి ఇవి అమల్లోకి వస్తాయని పేర్కొంది.

కొత్త నిబంధనల ప్రకారం 4 ఏళ్లలోపు చిన్నారులను తీసుకెళ్లేటప్పుడు లైఫ్‌జాకెట్‌ లాంటి కొత్త తరహా జాకెట్‌ ధరించాలని పేర్కొంది. ఈ జాకెట్‌కు ఉన్న స్ట్రాప్స్‌ని డ్రైవర్‌ నడుము చుట్టూ బెల్టు మాదిరిగా బిగించాలని తెలిపింది. ఈ జాకెట్‌ తక్కువ బరువుతో, సర్దుబాటుచేసుకొనే విధంగా, వాటర్‌ప్రూఫ్‌గా ఉండాలని పేర్కొంది. స్ట్రాప్స్‌ గట్టి నైలాన్‌ మెటీరియల్‌తో, 30 కేజీల బరువును పట్టి ఉంచేంత బలంగా డిజైన్‌ చేయాలని తెలిపింది.

ఇవి తప్పనిసరి..

  • చిన్నారులకు హెల్మెట్‌ను తప్పనిసరిగా పెట్టాలి.
  • 4 ఏళ్లలోపు పిల్లలతో వెళ్తున్న ద్విచక్రవాహన వేగం 40 కిలోమీటర్లకు మించరాదు.
  • ఈమేరకు కేంద్ర మోటారు వాహన నిబంధనలు 1989లో సవరణలు చేయనున్నట్లు పేర్కొంది.

ఇవీ చూడండి: Bajaj Dominar 400: బజాజ్​ నుంచి సూపర్ బైక్​.. ఫీచర్స్​ ఇలా...

Bank Holidays: నవంబర్‌లో బ్యాంకులకు 17 రోజుల సెలవు.. నిజమెంత?

ABOUT THE AUTHOR

...view details