మహంత్ నరేంద్ర గిరి (narendra giri maharaj) ఆత్మహత్య కేసులో రోజుకో కోణం బయటపడుతోంది. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆత్మహత్య లేఖపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 'చదువు రాని వ్యక్తి సూసైడ్ నోట్ రాస్తారా?' అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ఆత్మహత్య లేఖలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
ఫొటోతో బ్లాక్మెయిల్!
నరేంద్ర గిరి మృతికి కారణం ఓ ఫొటో అని తెలుస్తోంది. ఈ విషయం ఆయన తన సూసైడ్ నోట్‌గా పేర్కొంటున్న లేఖలో ఉంది. తను ఓ అమ్మాయితో సన్నిహితంగా ఉన్నట్లుగా ఫొటోను (narendra giri photo) ఎడిట్ చేసి ఆనంద్ గిరి (anand giri) బెదిరించేవాడని మహంత్ అందులో ఆరోపించారు. 'ఒకసారి ఈ పుకార్లను పుట్టించాక ఎంత మందికి మీ నిజాయతీని నిరూపించుకుంటారు' అని ఆనంద్ గిరి బ్లాక్మెయిల్ చేసే వాడని లేఖలో చెప్పుకొచ్చారు.
అయితే.. ఈ కోణాన్ని పోలీసులు ఖండిస్తున్నారు.
ఆ నిర్ణయాలే కారణమా?
నరేంద్ర గిరి ఆత్మహత్యపై (narendra giri news) అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇప్పటికే సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్నారు మహంత్ అనుచరులు.. తాజాగా ఆయన మరణం వెనుక పెద్ద కుట్రే జరిగిందని ఆరోపిస్తున్నారు. మహంత్ మృతికి కారణం కేవలం ఒకరు, ఇద్దరు కాదని.. ఎంతోమంది కలిసి ఈ కుట్ర పన్నినట్టు ఆరోపించారు. అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ఆయన తీసుకున్న పలు నిర్ణయాల పట్ల అనేక మంది నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయిందని వెల్లడించారు. ఈ క్రమంలో ప్రతీకార చర్యగా వారు నరేంద్ర గిరిని హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు.
గురు-శిష్యుల వైరం..
ఈ కేసులో ప్రధానంగా అందరి దృష్టి ఆయన శిష్యుడైన ఆనంద్ గిరిపైనే ఉంది. నరేంద్ర గిరిని హత్య చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆనంద్ గిరి.. మహంత్ నరేంద్ర గిరిల మధ్య వైరం ఇప్పటిది కాదు.