తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రోడ్డు పక్కన 2 లక్షల కరోనా టీకాలు

మధ్యప్రదేశ్‌లో ఆగి ఉన్న కంటైనర్​లో పెద్దఎత్తున కరోనా టీకాలు లభ్యమయ్యాయి. అందులో దాదాపు 2.40లక్షల టీకా డోసులు ఉండటం కలకలం సృష్టించింది. అయితే వ్యాక్సిన్​ లోడ్​తో ఉన్న ట్రక్కును అక్కడ నిలిపి.. డ్రైవర్, క్లీనర్​ పరారైనట్లు గుర్తించారు పోలీసులు.

more than two lacks of vaccine jabs found near road in madhyapradesh in a container
రోడ్డు పక్కన 2 లక్షల కరోనా టీకాలు

By

Published : May 1, 2021, 1:51 PM IST

ఓ వైపు రాష్ట్రాలన్నీ కరోనా వ్యాక్సిన్ల కొరతతో సతమతమవుతున్న వేళ మధ్యప్రదేశ్‌లో రోడ్డు పక్కన కరోనా టీకాలతో ఉన్న ట్రక్కును వదిలేసి వెళ్లడం కలకలం సృష్టిస్తోంది. నర్సింగ్‌పూర్‌ జిల్లాలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

రోడ్డు పక్కన నిలిపి ఉంచిన టీకాలతో నిండిన ట్రక్కు
ట్రక్కులోపల సోదాలు నిర్వహిస్తున్న పోలీసులు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరేలీ ప్రాంతంలో బస్టాండ్‌కు సమీపంలో ఓ ట్రక్కు చాలా సేపు ఆగి ఉండటంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ట్రక్కును తెరిచి చూడగా.. అందులో దాదాపు 2,40,000 డోసుల కొవాగ్జిన్‌ టీకాలు కనిపించాయి. డ్రైవర్‌, క్లీనర్‌ కన్పించలేదు. ట్రక్కు మీదున్న నంబరుతో డ్రైవర్‌ మొబైల్‌ లోకేషన్‌ను ట్రేస్‌ చేయగా.. హైవే సమీపంలోని చెట్ల పొదల్లో పడేసి ఉన్నట్లు గుర్తించారు.

ప్రభుత్వ అనుమతితో టీకాలు తరలిస్తున్నట్లు ట్రక్కుపై అంటించిన పోస్టర్
గంటలకొద్దీ నిలిపి ఉంచిన వ్యాక్సిన్ల ట్రక్కు

ట్రక్కులోని ఎయిర్ కండిషన్‌ పనిచేస్తుందని, డోసులు సురక్షితంగానే ఉన్నాయని పోలీసులు తెలిపారు. వాటి విలువ దాదాపు 8కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ట్రక్కును స్వాధీనం చేసుకున్న పోలీసులు డ్రైవర్‌, క్లీనర్‌ కోసం గాలిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవీ చదవండి:'టీకాలు లేవు.. మే1 నుంచి వ్యాక్సినేషన్​​ చేపట్టలేం'

దొంగలు బాబోయ్‌.. దొంగలు!

ABOUT THE AUTHOR

...view details