ఒడిశాలో ఓ వ్యక్తి మూగజీవాలకు విషం (Dog Poison) పెట్టి ప్రాణాలు తీశాడు. పన్నెండు వీధి కుక్కలను ఇలా చంపేశాడు. కటక్‌లోని శంకర్‌పుర్ ప్రాంతంలో (Cuttack Odisha) స్ట్రీట్ ఫుడ్ విక్రయించే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. జంతు హింస నిరోధక చట్టం (Prevention of Cruelty to Animals Act) కింద కేసు నమోదు చేశారు.
గత మూడు రోజుల నుంచి శునకాలు మృతి చెందుతున్నట్లు స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ప్రాథమిక దర్యాప్తు చేపట్టి నిందితుడిని గుర్తించారు. మరణించిన శునకాల దేహాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే, కుక్కలకు విషం పెట్టి చంపడానికి గల కారణాలు తెలియలేదు.