తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టీకా ఉత్సవ్: తొలి రోజు 27 లక్షల మందికి వ్యాక్సిన్​

దేశవ్యాప్తంగా 'టీకా ఉత్సవ్' జోరుగా సాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా తొలి రోజు 27 లక్షల మందికి పైగా టీకా అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. మొత్తంగా 10 కోట్ల 43 లక్షల డోసులు పంపిణీ చేసినట్లు తెలిపింది.

tika utsav
టీకా ఉత్సవ్: తొలి రోజు 27 లక్షల మందికి టీకా

By

Published : Apr 12, 2021, 5:21 AM IST

అర్హులైనవారందరికీ టీకా అందించడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు నిర్వహిస్తున్న'టీకా ఉత్సవ్'​లో భాగంగా తొలి రోజు 27 లక్షల మందికి పైగా టీకా తీసుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ టీకా ఉత్సవ్​ కార్యక్రమాన్ని ఏప్రిల్ 11 నుంచి 14 వరకు నిర్వహించనున్నారు.

"ప్రతి రోజు 45 వేల కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో టీకా ఇచ్చేవారు. కానీ, ఆదివారం 63 వేల కేంద్రాల్లో టీకా ఇచ్చారు. 'టీకా ఉత్సవ్​'లో భాగంగా 18,800 వ్యాక్సినేషన్​ కేంద్రాలను పెంచారు. సాధారణంగా ఆదివారాల్లో దాదాపు 16 లక్షల మంది మాత్రమే టీకా తీసుకునేవారు. కానీ, ఈసారి 27 లక్షల మంది టీకా తీసుకున్నారు."

--కేంద్ర ఆరోగ్య శాఖ.

ఆదివారం 8 గంటల లోపు 27,69,888 మందికి టీకా ఇచ్చినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. మొత్తంగా 10 కోట్ల 43 లక్షల

టీకా డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.

టీకా తొలి డోసు తీసుకున్న వారు

ఆరోగ్య సిబ్బంది-90,12,768

ఫ్రంట్​లైన్​ వర్కర్లు- 99,94,360

రెండో డోసు తీసుకున్న వారు

ఆరోగ్య సిబ్బంది- 55,23,718

ఫ్రంట్​లైన్ వర్కర్లు-47,93,536

4 కోట్ల 4 లక్షలకు పైగా వృద్ధులు కొవిడ్ టీకా తొలి డోసు తీసుకోగా.. 19 లక్షల 37 వేల మంది వృద్ధులు రెండో డోసు తీసుకున్నారు. 45-59 మధ్య వయస్కుల వారిలో 3 కోట్ల 19 లక్షలకు పైగా తొలి డోసు, 6 లక్షల 76 వేలకు పైగా రెండో డోసు తీసుకున్నారు.

ఇదీ చదవండి:మహారాష్ట్రలో ఒక్కరోజే 63,294 కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details