కర్ణాటక దావణగెరె జిల్లాలో ఓ వివాహ వేడుకకు హాజరై భోజనం చేసిన 150 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరందరినీ హుటాహుటిన సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. హోన్నాలి తాలుకా హలెదేవరహోన్నలి గ్రామంలో ఈ ఘటన జరిగింది. పెళ్లి భోజనం చేసిన అనంతరం వీరంతా వాంతులు, విరేచనాలతో నీరసపడిపోయారు. అయితే ఆస్పత్రిలో చికిత్స అనంతరం చాలా మంది కోలుకున్నారు. మరికొంత మందికి వైద్యం అందిస్తున్నారు. 10 మందిని మెరుగైన చికిత్స కోసం శిమోగాలోని మెక్ గాన్ ఆస్పత్రికి తరలించారు.
పెళ్లి భోజనం తిని 150 మందికి అస్వస్థత - Davanagere news latest
కర్ణాటకలో ఓ వివాహ వేడుకలో భోజనం చేసిన 150 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారందరినీ సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు.
పెళ్లి భోజనం తిని 150 మందికి అస్వస్థత
హోన్నాలి పోలీసులు వివాహం జరిగిన గ్రామాన్ని, ఆస్పత్రులను సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే 150 మంది అస్వస్థతకు గల అసలు కారణాలు తెలియాల్సి ఉంది.
Last Updated : Nov 13, 2021, 2:47 PM IST