కర్ణాటక దావణగెరె జిల్లా బెన్నెహళ్లి గ్రామంలో 100 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. ఓ ఇంట్లో బారసాల కార్యక్రమానికి హాజరైన వీరంతా అక్కడ భోజనం చేసిన తర్వాత వాంతులు, కడుపునొప్పితో బాధపడ్డారు. వెంటనే వీరందరినీ స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. చికిత్స అనంతరం చాలా మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు.
ఫంక్షన్లో ఆహారం తిన్న 100 మందికి అస్వస్థత - కర్ణాటక న్యూస్
ఓ ఇంట్లో శుభకార్యానికి హాజరై భోజనం చేసిన 100 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వీరందరినీ సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
![ఫంక్షన్లో ఆహారం తిన్న 100 మందికి అస్వస్థత More than 100 people fell sick after having Food in Davangere](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12873501-416-12873501-1629892322618.jpg)
కలుషిత ఆహారం తిని 100 మందికి అస్వస్థత
20 మంది మాత్రం జగలూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఇంకా చికిత్స పొందుతున్నారు. జగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈ ఘటన జరిగింది.
ఇదీ చూడండి:Vaccine Side Effects: భారత్లో కరోనా టీకా వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తక్కువే!