తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Vacancy in Indian Army: 'ఇండియన్ ఆర్మీలో లక్ష పోస్టులు ఖాళీ' - parliament winter session 2021

Vacancy in Indian Army: త్రివిధ దళాల్లోని ఖాళీల వివరాలను పార్లమెంట్‌ వేదికగా కేంద్రం వెల్లడించింది. అత్యధికంగా ఆర్మీలోనే ఖాళీలు ఉన్నాయని, అన్ని రెజిమెంట్లు, సేవల విభాగాల్లో ఈ కొరత ఉందని తెలిపింది. ఇండియన్​ ఆర్మీలోనే లక్షకుపైగా ఖాళీలున్నట్లు పేర్కొంది.

Vacancy in Indian Army
భారతీయ సైన్యంలో ఖాళీలు

By

Published : Dec 6, 2021, 9:53 PM IST

Vacancy in Indian Army: భారత సైన్యంలో లక్షకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ విషయాన్ని రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్​ భట్​.. రాజ్యసభలో వెల్లడించారు.

భట్​ తెలిపిన ఖాళీల వివరాలు ఇలా..

ఆర్మీలో మొత్తం 1,04,653 పోస్టుల ఖాళీలున్నాయి. అందులో 97,177 జవాన్​ ర్యాంక్​ పోస్టులు, మరో 7,476 ఆఫీసర్ల ర్యాంక్​ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది.

వైమానిక దళంలో మొత్తం 5,471 ఖాళీలుండగా.. అందులో 4,850 ఎయిర్‌మెన్ ర్యాంక్‌ పోస్టులు, మిగిలిన 621 ఆఫీసర్​ ర్యాంక్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

నేవీలో మొత్తం 12,431 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా.. అందులో 11,166 ర్యాంక్​ ఆఫ్ సెయిలర్స్​.. 1,265 ఆఫీసర్​ ర్యాంక్‌లు ఖాళీగా ఉన్నాయి.

రాజ్యసభలో భాజపా ఎంపీ రాకేశ్​ సిన్హా అడిన ప్రశ్నకు భట్​ లిఖితపూర్వంగా సమాధానం ఇచ్చారు. అత్యధికంగా ఆర్మీలోనే ఖాళీలు ఉన్నాయని, అన్ని రెజిమెంట్లు, సేవల విభాగాల్లో ఈ కొరత ఉందని వెల్లడించారు. ఈ ఖాళీల భర్తీకి కేంద్రం వివిధ రకాల చర్యలు తీసుకుంటోందని వివరించారు. యువతలో ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.

ఈ క్రమంలోనే స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా పేరిట రెజిమెంట్‌ను ఏర్పాటు చేయడాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందా? అన్న ప్రశ్నకు భట్ వివరణ ఇచ్చారు. "ప్రభుత్వ విధానం ప్రకారం.. వారి కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా పౌరులందరూ భారత సైన్యంలో చేరడానికి అర్హులు. స్వాతంత్య్రం తర్వాత ఒక నిర్దిష్ట తరగతి/సంఘం కోసం కొత్త రెజిమెంట్‌ను ఏర్పాటు చేయకూడదనేది ప్రభుత్వ విధానం." అని భట్​ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:'ప్రపంచంలో ఎన్ని మార్పులొచ్చినా.. భారత్​- రష్యా​ బంధం సుదృఢం'

ABOUT THE AUTHOR

...view details