తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దేశంలో 1.37 కోట్లకు పైగా కొవిడ్​ టీకా డోసులు పంపిణీ' - టీకా పంపిణీ గురించి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ

దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1.37 కోట్లకు పైగా టీకా డోసులను అందించినట్లు కేంద్రం శుక్రవారం తెలిపింది. వ్యాక్సిన్​ తీసుకోవడం వల్ల ఇప్పటివరకు ఏ ఒక్కరిలోనూ ఎలాంటి ప్రతికూలతలు నమోదు కాలేదని పేర్కొంది. శుక్రవారం ఒక్కరోజే 2,84,297 టీకా డోసులు పంపిణీ చేసినట్లు చెప్పింది.

vaccination in india
'దేశంలో 1.37 కోట్లకు పైగా కొవిడ్​ టీకా డోసులు పంపిణీ'

By

Published : Feb 27, 2021, 5:46 AM IST

దేశంలో కరోనా టీకా పంపిణీ కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 1.37 కోట్లకు పైగా వ్యాక్సిన్​ డోసులను ఆరోగ్య సిబ్బంది, కరోనా యోధులకు అందించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

లెక్కల్లో వ్యాక్సినేషన్​ ఇలా..

  • దేశవ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు 1,37,56,940 టీకా డోసులను పంపిణీ చేశారు. 2,89,320 సెషన్లలో వీటిని అందజేశారు.
  • ఆరోగ్య సిబ్బందిలో మెత్తం 66,37,049(76.6 శాతం) మంది.. టీకా మొదటి డోసు తీసుకోగా.. 22,04,083 మంది(62.9 శాతం)కి రెండో డోసు అందింది.
  • 49,15,808(47.7 శాతం) మంది కరోనా యోధులకు మొదటి డోసు టీకా అందింది.

శుక్రవారం ఒక్కరోజే..

  • శుక్రవారం ఒక్కరోజే 2,84,297 టీకా డోసులు పంపిణీ చేశారు. అందులో 1,13,208 మంది మొదటి డోసు టీకా తీసుకోగా.. 1,71,089 మంది లబ్ధిదారులు రెండో డోసు టీకా తీసుకున్నారు.
  • 10,405 సెషన్ల ద్వారా ఈ టీకాలను అందించారు.

ఇప్పటివరకు టీకా తీసుకున్న వారు.. వివిధ కారణాలతో 51 మంది(0.004 శాతం).. ఆసుపత్రిలో చేరినట్లు కేంద్రం తెలిపింది. వారిలో 27 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లగా.. 23 మంది ఆసుపత్రిలోనే మరణించినట్లు తెలిపింది. గత 24 గంటల్లో ఎవరూ ఆసుపత్రిలో చేరలేదని చెప్పింది. మొత్తం టీకా తీసుకున్నవారిలో 46 మంది మరణించారని పేర్కొంది. అయితే.. టీకా తీసుకోవడం వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ప్రతికూల సమస్యలు లేదా మరణాలు సంభవించలేదని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:మార్చి 1 నుంచి కొవిన్​లో టీకాలకు పేర్ల నమోదు

ABOUT THE AUTHOR

...view details