తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈటీవీ భారత్​ ఎఫెక్ట్​: చేపలమ్మే చిన్నారులకు ఫ్రీగా ఇల్లు!

లాక్​డౌన్ కారణంగా ఆర్థిక కష్టాలు రావడం వల్ల నానమ్మతో కలిసి చేపలు విక్రయిస్తున్న చిన్నారుల స్థితిపై ఈటీవీ భారత్​ కథనానికి ప్రభుత్వం సహా దాతల నుంచి స్పందన లభిస్తోంది. సొంతిల్లు కట్టుకోవాలన్న వారి కలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని కేరళ ప్రభుత్వం ప్రకటించింది.

ETV Bharat Big impact
ఈటీవీ భారత్​ ఎఫెక్ట్​ - చేపలమ్మే చిన్నారులకు చేయూత

By

Published : Jul 8, 2021, 7:07 PM IST

ఈటీవీ భారత్​ ఎఫెక్ట్​ - చేపలమ్మే చిన్నారులకు చేయూత

కేరళలోని తిరువనంతపురానికి చెందిన చిన్నారులు.. నానమ్మతో కలిసి చేపలు విక్రయిస్తూ జీవన పోరాటం సాగిస్తున్నారంటూ 'ఈటీవీ భారత్​ కేరళ' ఇటీవల ప్రచురించిన కథనానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. కష్టాల్లో ఉన్న చిన్నారులను వారి నాన్నమ్మ సుధను ఆదుకుంటామని హామీ ఇచ్చింది. సొంతిల్లు కట్టుకోవాలన్న వారి కలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని తెలిపింది.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన లైఫ్​ హౌసింగ్​ స్కీమ్​ కింద వారికి ఇల్లు నిర్మించేందుకు సిద్ధమని కేరళ విద్యాశాఖ మంత్రి శివన్​ కుట్టి బుధవారం వెల్లడించారు. అయితే ప్రస్తుతం అందుకు భూమి లేకపోవడమే సమస్యగా మారిందని.. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించి వారి కలను నెరవేరుస్తామని పేర్కొన్నారు.

దాతల సాయం..

'ఈటీవీ భారత్ కేరళ'​ కథనానికి దాతల నుంచి కూడా మంచి స్పందన లభించింది. చిన్నారులకు పలువురు పుస్తకాలు, బట్టలు అందించారు. స్థానిక కౌన్సిలర్​ పిల్లల ఆన్​లైన్​ చదువుల కోసం స్మార్ట్​ఫోన్​ను ఇచ్చారు.

ఈ ముగ్గురికి తాము ఆశ్రయం కల్పిస్తామంటూ ఎర్నాకులం, కన్నూరుకు చెందిన దాతులు ముందుకొచ్చినా.. తాను పెరిగిన ప్రాంతాన్ని విడిచి వచ్చేందుకు సుధ నిరాకరించింది.

ఇల్లు కట్టించి ఇస్తామన్న ప్రభుత్వ హామీ పట్ల సుధ, చిన్నారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:పులి పరార్: ఎలుగుబంటిని చూసి.. తోకముడిచి..

ABOUT THE AUTHOR

...view details