వచ్చే ఏడాది జరగనున్న అసోం అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించింది భాజపా. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. శుక్రవారం రాత్రి రాష్ట్రానికి చేరుకున్నారు. గువాహటి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న అమిత్ షా కు ఘనస్వాగతం లభించింది. వివిధ రంగాల జానపద కళాకారులు స్థానిక సంప్రదాయాల్లో.. నృత్యాలు చేస్తూ, పాటలు పాడుతూ స్వాగతం పలికారు.
రెండు రోజుల పాటు అసోం, మణిపుర్లో పర్యటించనున్న అమిత్ షా.. పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. గువాహటిలో రూ. 860 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన వైద్య కళాశాల, ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్నారు. అసోం వ్యాప్తంగా 11 న్యాయ కళాశాలలను కూడా ప్రారంభించనున్నారు. సీఎం సర్బానంద సోనోవాల్.. షా తో పాటు వివిధ కార్యక్రమాల్లో పాలుపంచుకోనున్నారు.
మణిపుర్లోనూ వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఆదివారం సాయంత్రానికి తిరిగి దిల్లీ బయల్దేరనున్నట్లు పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఎన్నికల సన్నద్ధత.. చేరికలే లక్ష్యం..