తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సింగర్​ సిద్ధూ కేసులో తొలి అరెస్ట్​.. 5 రోజుల కస్టడీకి నిందితుడు - ఉత్తరాఖండ్​ క్రైం న్యూస్​

Moosewala Murder Arrest: సిద్ధూ మూసేవాలా హత్య కేసులో తొలి అరెస్టు నమోదైంది. సిద్ధూ హత్య కేసులో దుండగులకు వాహనాలు సరఫరా చేశారన్న ఆరోపణలతో మన్​ప్రీత్​సింగ్​ అనే వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు.

Moosewala murder: Punjab Police makes first arrest
Moosewala murder: Punjab Police makes first arrest

By

Published : May 31, 2022, 10:42 PM IST

Moosewala Murder Arrest: ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో తొలి అరెస్టు నమోదైంది. ఉత్తరాఖండ్‌లో సోమవారం సాయంత్రం పట్టుబడ్డ మన్‌ప్రీత్‌ సింగ్‌తో పాటు మరో ఐదుగురిని సరిహద్దు రాష్ట్ర పోలీసులు అధికారికంగా అరెస్టు చేశారు. డ్రగ్స్ డీలర్‌గా పేరుపొందిన మన్‌ప్రీత్‌ సింగ్‌ను కోర్టు ఎదుట హాజరుపరచగా.. ఐదు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. ఆయుధాలకు సంబంధించిన నేరాలు, హత్యాయత్నం, అల్లర్లు, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినందుకుగాను మన్‌ప్రీత్‌ గతంలోనూ అరెస్టయినట్లు నిఘా వర్గాల సమాచారం.

గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ అరెస్టు తర్వాత కెనడాకు పారిపోయిన అతడి సహచరుడు గోల్డీబ్రార్‌.. సిద్ధు హత్యకు తామే ప్లాన్‌ చేసినట్లు వెల్లడించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు లారెన్స్‌ గ్యాంగ్‌ కదలికలను పసిగడుతూ వస్తున్నారు. మన్‌ప్రీత్‌ దేహ్రాదూన్‌లో ఉన్నట్లు గుర్తించిన పంజాబ్ పోలీసులు.. ఉత్తరాఖండ్ పోలీసులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్​టీఎఫ్​) సహాయంతో దేహ్రాదూన్‌లో ఈ ఆరుగురిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరైన మన్‌ప్రీత్‌.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు. సిద్ధు దారుణ హత్యలో ఇతడికి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగులకు వాహనాలు ఏర్పాటు చేసింది ఇతడేనని ఆరోపణలున్నాయి.

గత ఆదివారం సిద్ధూ మూసేవాలా(28) దారుణ హత్యకు గురయ్యాడు. ఇద్దరు స్నేహితులతో కలిసి మాన్సా జిల్లాలోని స్వగ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యలో గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించి.. సిద్ధుపై బుల్లెట్ల వర్షం కురిపించారు. అయితే గ్యాంగ్‌స్టర్‌ గొడవలు, హత్యల కారణంగానే సిద్ధూ మూసేవాలా హత్య జరిగినట్లు పంజాబ్‌ పోలీసు ఉన్నతాధికారి వీకే బవ్రా విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. గతేడాది అకాలీదల్‌ నాయకుడు విక్కీ మిద్దుఖేరా హత్య కేసులో మూసేవాలా మేనేజర్ పేరును లాగడంతో సిద్ధుపై కక్షగట్టిన దుండగులు ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. సిద్ధూ అంత్యక్రియలు వేల మంది అభిమానుల మధ్య మంగళవారం జరిగాయి. సిద్ధూ సొంత గ్రామమైన మాన్సా జిల్లాలోని మూసాలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పోస్ట్ మార్టం నిర్వహించిన మాన్సా సివిల్ ఆస్పత్రి నుంచి సిద్ధూ మృతదేహాన్ని మంగళవారం ఉదయం పటిష్ఠ బందోబస్తు మధ్య మూసాకు తీసుకొచ్చారు. సిద్ధూకు ఇష్టమైన ట్రాక్టర్​లోనే మృతదేహానికి అంతిమయాత్ర నిర్వహించారు.

ఇవీ చూడండి:ఈడీ కస్టడీకి దిల్లీ మంత్రి.. ఫరూక్​పై ప్రశ్నల వర్షం.. డీకేకు సమన్లు

ఇష్టమైన ట్రాక్టర్​లోనే సిద్ధూ అంతిమయాత్ర.. వేల మంది అభిమానుల కన్నీటి వీడ్కోలు

ABOUT THE AUTHOR

...view details