Monsoon Rainfall In India 2023 : నాలుగు నెలల నైరుతి రుతుపవనాల కాలం.. సాధారణ వర్షపాతంతో ముగిసిందని భారత వాతావరణ విభాగం శనివారం ప్రకటించింది. దేశంలో సాధారణంగా 868.6 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. ఎల్‌నినో పరిస్థితులను అధిగమించి 820 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపింది.
El Nino Effect In India Monsoon :రుతుపవనాల కాలంలో.. 94 నుంచి 106 మధ్య వర్షపాతం రికార్డైతే.. సాధారణంగా పరిగణిస్తారు. ఈ సారి నైరుతి రుతుపవనాలతో 94.4 శాతం వర్షపాతం నమోదైందని భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర చెప్పారు. సానుకూల కారకాలు ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించాయని చెప్పారు.
"36 వాతావరణ సబ్డివిజన్లలో, మూడు (మొత్తం విస్తీర్ణంలో 9 శాతం) సబ్డివిజన్లలో అధిక వర్షపాతం నమోదైంది. 26 సబ్డివిజన్లలో సాధారణ వర్షపాతం (మొత్తం విస్తీర్ణంలో 73 శాతం), ఏడు చోట్ల తక్కువ వర్షపాతం నమోదైంది. నాగాలాండ్, మణిపుర్, మిజోరం, త్రిపుర, గంగాటిక్ బంగాల్, ఝార్ఖండ్, బిహార్, తూర్పు ఉత్తర్ప్రదేశ్, సౌత్ ఇంటీరియర్ కర్ణాటక కేరళ తక్కువ వర్షపాతం ఉన్న ఏడు సబ్డివిజన్లు జాబిదాలో ఉన్నాయి"
--మృత్యుంజయ మహాపాత్ర, భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్