నైరుతి రుతుపవనాల కారణంగా సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మధ్య భారత్, ఉత్తర, దక్షిణ భారత్లో సాధారణ, ఈశాన్య ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని వివరించారు ఐఎండీ డైరక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్ర. జూన్- సెప్టెంబర్ మధ్య దీర్ఘకాలిక సగటులో 101 శాతం వర్షం పడొచ్చని తెలిపారు.
ఈసారి సాధారణ వర్షపాతం: ఐఎండీ - IMD DG Mrutyunjay Mohapatra
నైరుతి రుతుపవనాల వల్ల ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) డైరక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్ర తెలిపారు.
భారత వాతావరణ శాఖ
అంతకుముందు.. నైరుతి రుతుపవనాల రాక రెండు రోజులు ఆలస్యం కానుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 3న ఇవి కేరళ తీరాన్ని తాకే అవకాశముందని పేర్కొంది.
ఇదీ చదవండి :అభివృద్ధి పేరిట విధ్వంసం- విలయం వలలో కేరళ
Last Updated : Jun 1, 2021, 2:33 PM IST