తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బుల్లెట్ ప్రూఫ్ జాకెట్​లో కోతి.. పోలీస్​ షూటౌట్​లో మృతి.. అసలేమైంది? - కాల్పుల్లో బుల్లెట్ ప్రూఫ్ కోతి

Monkey in bulletproof vest: బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించిన ఓ కోతి పోలీస్ షూటౌట్​లో చనిపోయింది. ఛాతికి బుల్లెట్ గాయమై విగతజీవిగా పడిపోయింది. అసలేమైందంటే?

Monkey in bulletproof vest
Monkey in bulletproof vest

By

Published : Jun 19, 2022, 6:50 PM IST

Mexico Monkey shootout dead:మెక్సికోలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించిన కోతి కాల్పుల్లో చనిపోయింది. స్మగ్లర్లకు, పోలీసులకు మధ్య జరిగిన ఎన్​కౌంటర్లో కోతి మరణించింది. ఈ కోతిని.. చనిపోయిన స్మగ్లర్ల బృందానికి చెందిన ఓ వ్యక్తి పెంచుకుంటున్నాడని పోలీసులు గుర్తించారు. మెక్సికోలో సాధారణంగా డ్రగ్ స్మగ్లర్లు తమ హోదాకు చిహ్నంగా జంతువులను పెంచుకుంటారు. ఇలాగే మృతి చెందిన వ్యక్తి కోతిని పెంచుకున్నట్లు తెలుస్తోంది.

'ల ఫామిలియా మిచోవాకనా' ముఠాకు చెందిన అతడి వయసు 20లలోనే ఉంటుందని స్థానిక వార్తా సంస్థ తెలిపింది. కొన్ని బుల్లెట్లు అతడి శరీరానికి తగిలాయని పేర్కొంది. అతడు పెంచుకుంటున్న కోతికి సైతం బుల్లెట్ గాయమైందని తెలిపింది. ఛాతిలో తూటా దిగడం వల్ల కోతి అక్కడికక్కడే చనిపోయిందని స్పష్టం చేసింది. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్న ఆ కోతి.. ప్రాణాలు కోల్పోయి నేల మీద పడి ఉన్న చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బుల్లెట్ గాయం వల్లే కోతి మరణించిందా? అనే అంశంపై పోలీసులు దృష్టిసారించారు. కోతి మృతదేహానికి వెటర్నరీ డాక్టర్​ ఆధ్వర్యంలో శవపరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. కోతి స్మగ్లర్లదే అని నిర్ధరణ అయితే.. పట్టుబడ్డ నిందితులపై జంతువుల అక్రమ రవాణా చట్టం కింద కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

మరోవైపు, ఈ ఎన్​కౌంటర్​లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ స్థాయిలో ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మందుగుండు సామగ్రి, ఆయుధాల క్యాట్రిడ్జ్​లు, పలు వాహనాలను సైతం సీజ్ చేశారు. అరెస్టు చేసిన నిందితుల్లో 15ఏళ్ల బాలుడు సైతం ఉన్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details