Monkey Fever karnataka: కర్ణాటక శివమొగ్గ జిల్లాలో అరుదైన మంకీ ఫీవర్ కలకలం రేపింది. తీర్థహళ్లి మండలంలో ఓ మహిళకు(57) ఈ జ్వరం వచ్చినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఈ ఏడాది మంకీ ఫీవర్ మొదటి కేసు నమోదైందని పేర్కొన్నారు.
జ్వరంతో ఆస్పత్రికి చేరిన మహిళకు సంబంధిత లక్షణాలు ఉండడంతో డాక్టర్లు పరీక్షలు చేశారు. దీంతో మంకీ ఫీవర్ అని తేలింది. తీర్థహళ్లీ జేసీ ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
రెండేళ్ల క్రితం రాష్ట్రంలో సాగర్ మండలంలోని అరళగోడు గ్రామంలో మంకీ ఫీవర్తో 26 మంది మరణించారు. ఆ తర్వాత ఇలాంటి కేసులు వెలుగులోకి రాలేదు.
monkey fever symptoms: మంకీ ఫీవర్ దక్షిణాసియాలో కోతుల ద్వారా మనుషులకు సోకిన వైరల్ జబ్బు. అధిక జ్వరం, ఒళ్లు నొప్పులతో దాదాపుగా డెంగీ లక్షణాలను కలిగి ఉంటుంది. దీని కారణంగా 5 నుంచి 10 శాతం మరణాలు సంభవిస్తాయి.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి:భయపెడుతున్న థర్డ్ వేవ్.. సుడిగాలిలా ఒమిక్రాన్ విజృంభణ