Monitor Lizard Rape: మహారాష్ట్ర కొల్హాపూర్లో అత్యంత దారుణ ఘటన వెలుగుచూసింది. సతారాలోని సహ్యాద్రి టైగర్ ప్రాజెక్ట్ పరిధిలో ఓ వ్యక్తి.. ఉడుముపై అత్యాచారం చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు మొబైల్ ఫోన్లో రికార్డయ్యాయి. కేసు నమోదు చేసిన అధికారులు.. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేశారు. కాగా నిందితుడిని మానసిక వైద్యుని వద్దకు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Monitor Lizard Rape: దారుణం.. ఉడుముపై అత్యాచారం! - sahyadri rape news
Monitor Lizard Rape: ఉడుముపై అత్యాచారం చేసిన దారుణ ఘటన మహారాష్ట్రలోని కొల్హాపూర్లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.
ఇదీ జరిగింది: సహ్యాద్రి టైగర్ ప్రాజెక్ట్ పరిధిలో పులులను లెక్కించేందుకు కెమెరాలను ఏర్పాటు చేశారు. అయితే, కొందరు వ్యక్తులు వేట తుపాకులతో సంచరిస్తున్నట్లు కనిపించింది. వీరి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు తీసుకుని పరిశీలిస్తుండగా.. ఉడుముపై అత్యాచారం బయటపడింది. విచారణ మొదలుపెట్టిన అటవీ అధికారులు.. ఏప్రిల్ 1న అనుమానితుడిని గుర్తించారు. అతని వద్ద బైకులు, తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. అతడు లైసెన్స్ లేని వేటగాడని తేలింది. దీంతో మొత్తం ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
ఇదీ చదవండి:Live Video: బావిలో పడ్డ చిరుత.. మంచం సాయంతో పైకి..