తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీసీబీ విచారణకు మాజీ సీఎం భార్య - రాధికా కుమారస్వామిపై మనీల్యాండరింగ్ కేసు

సినీ నటి, కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి భార్య రాధికా కుమారస్వామి సీసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. అక్రమ లావాదేవీలు జరిపినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి.

Radhika Kumaraswamy Money Laundering Case
రాధికా కుమారస్వామిపై మనీల్యాండరింగ్ కేసు

By

Published : Jan 8, 2021, 1:48 PM IST

అక్రమ లావాదేవీల ఆరోపణల నేపథ్యంలో కన్నడ నటి, కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి భార్య రాధికా కుమార స్వామి శుక్రవారం బెంగళూరులో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) విచారణకు హాజరయ్యారు.

భాజపా నాయకులు, మంత్రుల పేర్లు చెప్పుకుని కోట్ల రూపాయలు వసూలు చేసిన ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టయిన స్వామి అలియాస్‌ యువరాజ్‌ నుంచి నగదు తీసుకున్నారనేది రాధిక ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోపణ.

ఈ ఆరోపణలపై రాధిక ఇదివరకే వివరణ కూడా ఇచ్చారు. స్వామి తమ కుటుంబ స్నేహితుడని.. అతను 17 ఏళ్ల నుంచి తెలుసని తెలిపారు. ఓ సినిమా నిర్మాణం కోసం స్వామి అకౌంట్​ నుంచి రూ.15 లక్షలు.. మరో వ్యక్తి నుంచి రూ.60 లక్షల అందినట్లు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details