తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కరోనా చికిత్సలో ఆ మాత్ర వద్దు.. వాడితే సంతానోత్పత్తిలో ఇబ్బంది!' - మోల్నుపిరవిర్ సంతానోత్పత్తి

Molnupiravir side effects: కరోనా చికిత్సలో ఉపయోగించే మోల్నుపిరవిర్ ఔషధాన్ని యువతకు ఇవ్వడం మంచిది కాదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ ఔషధం వల్ల శరీరంలో మ్యుటేషన్లు తలెత్తుతాయని, తద్వారా సంతానోత్పత్తిపై ప్రభావం పడుతుందని హెచ్చరించారు. మరోవైపు, మోల్నుపిరవిర్​ను కొవిడ్ చికిత్సలో చేర్చడం లేదని ఐసీఎంఆర్ అధికారులు తెలిపారు.

molnupiravir for treating covid
molnupiravir for treating covid

By

Published : Jan 11, 2022, 7:16 PM IST

Molnupiravir effect on reproduction system: కరోనా చికిత్సలో వాడుతున్న మోల్నుపిరవిర్​ ఔషధాన్ని యువతకు ఇవ్వకూడదని.. ఇమ్యునైజేషన్​పై ఏర్పాటు చేసిన జాతీయ సాంకేతిక సలహా సంఘం వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ ఎన్​కే అరోడా స్పష్టం చేశారు. మోల్నుపిరవిర్ ఇస్తే యువత సంతానోత్పత్తి వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరించారు. ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. అహేతుకంగా ఔషధాన్ని వినియోగించడం ప్రమాదకరమని అన్నారు.

"ఇన్ఫెక్షన్ సోకిన తొలినాళ్లలో మోల్నుపిరవిర్ ఇస్తే ప్రయోజనాలు ఉంటాయి. ఐసీయూలు, ఆస్పత్రిలో చేరే ముప్పును ఔషధం తగ్గిస్తుంది. ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వృద్ధులకు చికిత్సలో ఇది ఉపయోగపడుతుంది. యువతకు ఈ ఔషధాన్ని ఇవ్వకూడదు. ఇది శరీరంలో మ్యుటేషన్లను ఏర్పరుస్తుంది. ఇది సంతానోత్పత్తి వ్యవస్థపై ప్రభావం చూపుతుంది."

-ఎంకే అరోడా

Molnupiravir for Covid-19 treatment

మరోవైపు, మోల్నుపిరవిర్​ను కరోనా చికిత్సలో చేర్చడం లేదని అధికారులు తెలిపారు. కొవిడ్ క్లినికల్ మేనేజ్​మెంట్ ప్రొటోకాల్​లో మోల్నుపిరవిర్​ను చేర్చకూడదని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) నేషనల్ టాస్క్​ఫోర్స్ నిర్ణయించిందని వెల్లడించారు. 'కరోనా చికిత్సలో ఈ ఔషధం పెద్దగా ప్రభావం చూపడం లేదని సోమవారం జరిగిన సమావేశంలో నిపుణులు అభిప్రాయపడ్డారు' అని అధికారులు చెప్పారు. మోల్నుపిరవిర్ వల్ల దుష్ప్రభావాలు తలెత్తుతున్న నేపథ్యంలో.. ఈ డ్రగ్ మాత్రలను కొవిడ్ చికిత్స జాబితాలో చేర్చలేదని ఐసీఎంఆర్ హెడ్ డాక్టర్ బలరాం భార్గవ తెలిపారు.

Molnupiravir latest news

మోల్నుపిరవిర్ ఔషధానికి డిసెంబర్​లో అత్యవసర అనుమతులు లభించాయి. ఔషధాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సిప్లా సంస్థకు డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. జనవరి 3న ఈ ఔషధం కొవిడ్ బాధితులకు అందుబాటులోకి వచ్చింది. అయితే, చాలా మంది వైద్యులు ఈ డ్రగ్​ను రోగులకు సిఫార్సు చేయడం లేదని తెలుస్తోంది.

ఇదీ చదవండి:Corona test guidelines: 'లక్షణాలు లేకుంటే కరోనా పరీక్ష అవసరం లేదు'

ABOUT THE AUTHOR

...view details