Molestation case: విద్యాబుద్ధులు నేర్పాల్సిన కొందరు ఉపాధ్యాయులు కామంతో కళ్లు మూసుకుపోయి వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఆరేళ్ల బాలికపై ఓ టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడిన దుర్ఘటన జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో వెలుగులోకి వచ్చింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు కుటుంబ సభ్యులు. స్థానికులు కూడా వీరికి మద్దతు తెలిపారు.
" మార్చి 31న ఆరేళ్ల బాలికపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ తర్వాత బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ రోజు స్థానికులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. బాలికపై అత్యాచారం జరగలేదని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వైద్య పరీక్షలోనూ అదే నిర్ధరణ అయింది. నిందితుడిని అరెస్ట్ చేశాం. ఐపీసీ సెక్షన్ 376, పోక్సో చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశాం."