mohan bhagwat news: హిందువులం అన్న భావనను మరచిపోవడం వల్లనే దేశ విభజన జరిగి పాకిస్థాన్ ఏర్పడిందని ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భాగవత్ అన్నారు. శనివారం గ్వాలియర్‌లోని జివాజీ విశ్వవిద్యాలయం అటల్ బిహారీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ హిందువుల స్వాభిమానాన్ని ప్రస్తావించారు.
" హిందువులు లేకుండా భారతదేశం లేదు. భారతదేశం లేకుండా హిందువులు కూడా లేరు. హిందువులను, భారతదేశాన్ని విడదీసి చూడలేం. కానీ తాము హిందువులం అన్న భావాన్ని చాలా మంది మరిచిపోయారు. వారు హిందువులు కారని ముస్లింలు కూడా అనుకున్నారు. అందువల్లనే పాకిస్థాన్ ఏర్పడింది. తొలుత హిందువులమని భావించే వారి సంఖ్య తగ్గింది. తరువాత హిందువుల సంఖ్యే తగ్గింది. పాకిస్థాన్ ఏర్పడటం వల్ల ఇక ఇది హిందుస్థాన్ అయింది. హిందూమతానితో సంబంధం ఉన్నవాటినే ఇక్కడ అభివృద్ధి చేయాలి."
-- మోహన్ భాగవత్, ఆర్ఎస్ఎస్ అధిపతి