కరోనా నివారణకు తగిన ఏర్పాట్లు చేయలేదన్న కారణంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠ గతంలో ఎన్నడూలేని కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అమెరికాలోని ఓ సంస్థతో పాటు, మరో దేశీయ సంస్థ నిర్వహించిన సర్వేల్లో ఈ విషయం వెల్లడైంది. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ జరిపిన సర్వేలో ఈ వారం.. మోదీ రేటింగ్ 63 శాతంగా ఉంది. ఏప్రిల్ అయితే 22 పాయింట్ల మేర తగ్గింది. ఆయన మద్దతు వర్గంలో క్రమేణా తగ్గుదల కనిపిస్తోంది.
'కనిష్ఠ స్థాయికి మోదీ ప్రతిష్ఠ' - కనిష్ఠ స్థాయికి మోదీ ప్రతిష్ఠ
దేశంలో కొవిడ్ కట్టడికి సరైన చర్యలు చేపట్టలేదనే కారణంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్ఠ ఎన్నడూ లేనంతగా కనిష్ఠ స్థాయికి చేరింది. అమెరికాలోని ఓ సంస్థతో పాటు, దేశీయ సంస్థ వెల్లడించిన సర్వేలో ఈ విషయం బహిర్గతమైంది.
నరేంద్ర మోదీ, ప్రధాని మోదీ
మార్నింగ్ కన్సల్ట్.. 12 మంది ప్రపంచ స్థాయి నాయకుల రేటింగ్‌ను పరిశీలిస్తుంటుంది. 2019 ఆగస్టు నుంచి మోదీకి ఉన్న ప్రజాదారణపై సర్వే చేస్తోంది. దేశీయ సంస్థ సీవోటర్ జరిపిన సర్వేలోనూ దాదాపుగా ఇవే ఫలితాలు వచ్చాయి. మోదీ పాలన 'చాలా బాగుంది' అని గతేడాది 65 శాతం మంది చెప్పగా.. ఈ ఏడాది అది 37 శాతానికి పడిపోయింది.
ఇదీ చదవండి:లాక్డౌన్లో కలెక్టర్ సైక్లింగ్- అడ్డుకున్న లేడీ కానిస్టేబుల్
Last Updated : May 20, 2021, 7:29 AM IST