తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వారణాసిలో మోదీ బిజీబిజీ- అర్ధరాత్రి వేళ కూడా.. - అభివృద్ధి పనులను పరిశీలించిన మోదీ

Modi varanasi visit: ఉత్తర్​ప్రదేశ్​​ పర్యటనలో భాగంగా సోమవారం అర్ధరాత్రి వారణాసిలోని రైల్వే స్టేషన్​ను ప్రధాని మోదీ సందర్శించారు. వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. మోదీ వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ కూడా ఉన్నారు.

Modi varanasi visit
వారణాసిలో మోదీ

By

Published : Dec 14, 2021, 5:17 AM IST

Modi varanasi visit: ఉత్తర్​ప్రదేశ్​లో రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారంకాశీ విశ్వనాథ్​ కారిడార్​​ ప్రాజెక్టు ప్రారంభం సహా వివిధ కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. అయితే.. సోమవారం అర్ధరాత్రి కూడా ఆయన బిజీగానే గడిపారు. బనారస్(వారణాసి) రైల్వే స్టేషన్​ను ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్​తో కలిసి సందర్శించారు. నగరంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.

Modi in banaras station: "రైళ్ల కనెక్టివిటీని మెరుగుపరచడం సహా పరిశుభ్రత, ఆధునికత, ప్రయాణికులకు స్నేహపూర్వక రైల్వే స్టేషన్ల ఏర్పాటులో తమ ప్రభుత్వం కృషి చేస్తోంది" అని బనారస్ రైల్వే స్టేషన్ సందర్శన అనంతరం మంగళవారం ఉదయం 1:23 గంటలకు మోదీ ట్వీట్ చేశారు.

బనారస్ రైల్వే స్టేషన్​లో మోదీ
బనారస్ రైల్వే స్టేషన్​లో మోదీ

Modi inspections in varanasi: అంతకుముందు.. వారణాసిలో కీలక అభివృద్ధి పనులను యోగి ఆదిత్యానాథ్​తో కలిసి మోదీ పరిశీలించారు. స్థానికులతో ఆయన ముచ్చటించారు. "ఆధ్యాత్మిక నగరంలో సాధ్యమైనంత మేర ఉత్తమమైన మౌలిక వసతులు కల్పించేందుకు తాము ప్రయత్నిస్తాం" అని ట్విట్టర్​ వేదికగా మోదీ పేర్కొన్నారు.

యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్​ కలిసి అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న మోదీ
స్థానికులకు అభివాదం చేస్తున్న మోదీ
చిన్నారితో సరదాగా..
వారణాసిలో అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న మోదీ

సోమవారం భాజపా ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులతోనూ మోదీ సమావేశమయ్యారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details