టీకా టూర్ సక్సెస్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'టీకా టూర్' ముగిసింది. పుణెలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను సందర్శించిన అనంతరం.. పుణె విమానాశ్రయం నుంచి దిల్లీకి తిరుగుపయనం అయ్యారు ప్రధాని.
18:13 November 28
టీకా టూర్ సక్సెస్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'టీకా టూర్' ముగిసింది. పుణెలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను సందర్శించిన అనంతరం.. పుణె విమానాశ్రయం నుంచి దిల్లీకి తిరుగుపయనం అయ్యారు ప్రధాని.
18:00 November 28
సీరం సంస్థను సందర్శించిన అనంతరం పుణె విమానాశ్రయానికి తిరుగుపయనమయ్యారు మోదీ. అక్కడి నుంచి విమానంలో దిల్లీ చేరుకుంటారు.
17:39 November 28
సీరం సంస్థ అభివృద్ధి చేస్తున్న కొవిషీల్డ్ వ్యాక్సిన్ పురోగతిని సమీక్షించారు మోదీ. పుణెలోని ఆ సంస్థ కార్యాలయాన్ని సందర్శించారు. శాస్త్రవేత్తలను వివరాలు అడిగి తెలుకున్నారు. టీకా ఉత్పత్తి, పంపణీకి సన్నద్ధతపై చర్చించారు. సీరం సంస్థ సీఈఓ అదర్ పూనావాలా.. ప్రధానికి అన్ని విషయాలు వివరించారు.
16:57 November 28
కరోనా టీకా పురోగతిని సమీక్షించేందుకు మహారాష్ట్ర పుణెలోని సీరం సంస్థకు చేరుకున్నారు మోదీ. కొవిషీల్డ్ వ్యాక్సిన్‌కు సంబంధించిన వివరాలను శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకుంటున్నారు.
16:24 November 28
సీరం సంస్థను సందర్శించేందుకు పుణె చేరుకున్నారు ప్రధాని మోదీ. కొవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి, ఉత్పత్తి, పంపిణీ ఏర్పాట్లను సమీక్షించనున్నారు.
15:24 November 28
హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ ప్లాంట్‌ను సందర్శించిన అనంతరం పుణె బయల్దేరారు ప్రధాని మోదీ. అక్కడ కొవిషీల్డ్ టీకాను అభివృద్ధి చేస్తున్న సీరం సంస్థను సందర్శించనున్నారు. కొవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి, ఉత్పత్తి, పంపిణీ ఏర్పాట్లను సమీక్షించనున్నారు. ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్‌తో కలిసి సీరం సంస్థ కొవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తోంది.
15:05 November 28
కరోనా టీకా అభివృద్ధి చేస్తున్న హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ ప్లాంట్‌ను సందర్శించారు మోదీ. వ్యాక్సిన్ పురోగతిపై శాస్త్రవేత్తలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు జరిపిన ప్రయోగాల్లో ఆశాజనక ఫలితాలు సాధించినందుకు గానూ వారికి అభినందనలు తెలిపారు. టీకాను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు భారత్ బయోటెక్ శాస్త్రవేత్తల బృందం, ఐసీఎంఆర్‌తో కలిసి పనిచేస్తున్నట్లు మోదీ ట్వీట్ చేశారు.
14:41 November 28
13:42 November 28
టీకాపై ఆరా
జినోమ్‌వ్యాలీలోని భారత్ బయోటెక్‌ను సందర్శిస్తున్నారు ప్రధాని. ఆ సంస్థ రూపొందిస్తున్న కొవాగ్జిన్ తయారీని పరిశీలిస్తున్నారు. శాస్త్రవేత్తలతో మాట్లాడి కొవాగ్జిన్ పురోగతిని తెలుసుకుంటున్నారు. భారత్ బయోటెక్ 'కొవాగ్జిన్' ప్రస్తుతం మూడోదశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉంది.
13:35 November 28
13:21 November 28
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ చేరుకున్నారు. కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిపై సమీక్షించేందుకు మూడు నగరాల పర్యటనలో భాగంగా ప్రధాని హకీంపేట వైమానిక స్థావరానికి చేరుకున్నారు. ఇవాళ ఉదయం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జైడస్ క్యాడిలా బయోటెక్ పార్క్‌ను సందర్శించారు. అనంతరం అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేట చేరుకున్నారు.
హకీంపేట నుంచి నేరుగా నగరశివార్లలోని జినోమ్‌వ్యాలీలో గల భారత్ బయోటెక్ సంస్థకు వెళ్తారు. ఈ సంస్థ ‘కొవాగ్జిన్’ పేరుతో టీకాను అభివృద్ధి చేస్తోంది. దీనిపై మూడో దశ క్లినికల్ ప్రయోగాలు జరుగుతున్నాయి. మోదీ ఆ సంస్థలో కరోనా టీకా అభివృద్ధి, ఉత్పత్తిని పరిశీలించి పురోగతి పనులను సమీక్షిస్తారు. భారత్ బయోటెక్ యాజమాన్యం, శాస్త్రవేత్తలతో మాట్లాడతారు.
13:05 November 28
12:27 November 28
11:25 November 28
కరోనా టీకాపై సమీక్షలో భాగంగా జైడస్ క్యాడిలా బెయోటెక్ పార్క్‌ను సందర్శించిన అనంతరం అక్కడి నుంచి వెనుదిరిగారు ప్రధాని మోదీ. సంస్థ కార్యాలయం వద్ద ఆయనను చూసేందుకు గుమిగూడిన ప్రజలకు అభివాదం చేశారు.
10:55 November 28
జైడస్ ప్లాంట్‌లో మోదీ..
జైడస్ బయోటెక్ పార్క్‌కు చేరుకున్న ప్రధాని మోదీ.. వ్యాక్సిన్ తయారీని పరిశీలించారు. టీకా ఉత్పత్తికి సంబంధించి శాస్త్రవేత్తలను ఆరా తీశారు.
10:12 November 28
కొవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించేందుకు అహ్మదాబాద్ చంగోదర్ పారిశ్రామిక ప్రాంతంలోని జైడస్ బయోటెక్ పార్క్‌కు చేరుకున్నారు మోదీ.
09:08 November 28
మూడు నగరాల్లో మోదీ పర్యటన
దేశంలో తయారవుతోన్న వ్యాక్సిన్ల సమీక్షలో భాగంగా.. గుజరాత్ అహ్మదాబాద్‌కు చేరుకున్నారు ప్రధాని నరేంద్రమోదీ.
భారత్‌లో కరోనా టీకాను అభివృద్ధి చేస్తోన్న భారత్ బయోటెక్, సీరం, జైడస్ క్యాడిలా సంస్థలను మోదీ ఇవాళ సందర్శించనున్నారు. పుణె, అహ్మదాబాద్, హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. వ్యాక్సిన్ అభివృద్ధి, ఉత్పత్తి, పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లను ఆయన స్వయంగా సమీక్షించనున్నారు. పర్యటన సందర్భంగా వ్యాక్సిన్‌కు సంబంధించి మోదీ కీలక ప్రకటన చేస్తారని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
వరుసగా మూడు నగరాలకు..
ప్రధాని మొదట గుజరాత్‌లోని జైడస్ క్యాడిలా కర్మాగారాన్ని సందర్శిస్తారు. జైడస్ క్యాడిలా సంస్థ అభివృద్ధి చేస్తున్న 'జైకోవ్-డి' టీకా ప్రస్తుతం రెండో దశ ప్రయోగాల్లో ఉంది.
భారత్ బయోటెక్‌కు...శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని హకీంపేట వైమానికి స్థావరానికి ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. అక్కడి నుంచి నగర శివార్లలోని జినోమ్ వ్యాలీలో గల భారత్ బయోటెక్ సంస్థకు వెళ్తారు. ఈ సంస్థ 'కొవాగ్జిన్' పేరుతో టీకాను అభివృద్ధి చేస్తోంది. మూడో దశ క్లనికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. మోదీ ఆ సంస్థలో కరోనా టీకా అభివృద్ధి, ఉత్పత్తిని పరిశీలించి పురోగతి పనులను సమీక్షిస్తారు. భారత్ బయోటెక్ యాజమాన్యం, శాస్త్రవేత్తలతో మాట్లాడతారు. అక్కడాయన సుమారు గంటసేపు గడుపుతారు.
పుణె పర్యటనలో భాగంగా... అస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్‌తో కలిసి సీరం సంస్థ అభివృద్ధి చేస్తోన్న 'కొవిషీల్డ్' వ్యాక్సిన్‌కు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుంటారు. టీకా ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది, పంపిణీకి సంబంధించిన ఏర్పాట్ల గురించి ఆరా తీస్తారు. సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న ఈ టీకా రెండు దశల ప్రయోగాలు పూర్తయ్యాయి. అనంతరం మోదీ దిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.