తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో రెట్టింపు వేగంతో అభివృద్ధి' - gorakhpur modi news

MODI UP VISIT: కేంద్రం, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే రెట్టింపు వేగంతో అభివృద్ధి జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అణగారిన వర్గాల గురించి ఆలోచించే ప్రభుత్వం.. కష్టపడి పనిచేయడమే కాకుండా ఫలితాలు కూడా సాధిస్తుందని చెప్పారు.

MODI UP VISIT
MODI UP VISIT

By

Published : Dec 7, 2021, 2:21 PM IST

MODI UP VISIT: డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ద్వారా రెట్టింపు వేగంతో పనులు జరుగుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నిజాయితీతో పనులు చేస్తే.. ప్రకృతి విపత్తులు కూడా ఆ పనులకు అడ్డంకి కావని అన్నారు. ఉత్తర్​ప్రదేశ్​ గోరఖ్​పుర్​లో నిర్మించిన ఎయిమ్స్​, ఫర్టిలైజర్ ప్లాంట్​ను ప్రారంభించారు ప్రధాని.

ఎయిమ్స్​ను ప్రారంభిస్తున్న మోదీ. పక్కన యూపీ సీఎం యోగి, గవర్నర్ ఆనందీబెన్ పటేల్
ఎయిమ్స్ సహా ఇతర అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకాలు

Modi opening Gorakhpur AIIMS:

"అణగారిన వర్గాల గురించి ఆలోచించే ప్రభుత్వం ఉంటే.. కష్టపడి పనిచేయడమే కాకుండా ఫలితాలను సైతం సాధిస్తుంది. గోరఖ్​పుర్​లో ఫెర్టిలైజర్ ప్లాంట్, ఎయిమ్స్​ ప్రారంభం అనేక సందేశాలను ఇస్తోంది. సంకల్పంతో ఉంటే నవ భారతంలో ఏదైనా అసాధ్యం కాదనే నిజాన్ని చాటి చెబుతోంది. కరోనా సమయంలోనూ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం.. తన అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించింది. గోరఖ్​పుర్ ఫెర్టిలైజర్ ప్లాంట్.. రైతులకు, ఉపాధికి ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. కానీ గత ప్రభుత్వాలు దీన్ని ప్రారంభించేందుకు యత్నించలేదు. గోరఖ్​పుర్​కు ఎయిమ్స్​ కోసం ఎన్నో రోజుల నుంచి డిమాండ్ ఉంది. కానీ 2017కు ముందు ప్రభుత్వాలు స్థలం కేటాయించేందుకూ సాకులు వెతికాయి."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

కల సాకారం: యోగి

గోరఖ్​పుర్​కు వచ్చిన ఆయనకు.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన యోగి.. గత ముప్పై ఏళ్లలో ఐదు ప్రభుత్వాలు వచ్చి పోయాయని, భాజపా ప్రభుత్వం మాత్రమే ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీని ప్రారంభించే ధైర్యం చేసిందని అన్నారు. ఇది యూపీ ప్రజల కల సాకారమైన రోజు అని చెప్పారు.

మోదీ సభకు హాజరైన జనం

'1990లో ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ మూతపడింది. 2014 వరకు దీని పునఃప్రారంభానికి ఎవరూ ప్రయత్నించలేదు. గోరఖ్​పుర్ ప్రజలు 40 ఏళ్లుగా వైద్యసేవల కోసం పోరాడుతున్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల లక్షల మంది చనిపోయారు. కానీ ఈరోజు యూపీ.. 17 కోట్ల టీకా డోసులను పంపిణీ చేసి మైలురాయిని చేరుకుంది' అని అన్నారు యోగి.

.

Gorakhpur aiims:

రూ.1,011 కోట్ల వ్యయంతో గోరఖ్​పుర్ ఎయిమ్స్ నిర్మాణం చేపట్టారు. 112 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 300 పడకలు ఉండగా.. జనవరి నాటికి 450 పడకలను అందుబాటులోకి తేనున్నారు. పూర్తిగా అందుబాటులోకి వస్తే ఆస్పత్రిలో 750 పడకలు ఉంటాయి. 14 మాడ్యూళ్లతో కూడిన ఆపరేషన్ థియేటర్లను ఎయిమ్స్​లో నిర్మించారు. అత్యాధునిక సీటీ స్కాన్, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్ వంటి వసతులు ఆస్పత్రిలో అందుబాటులో ఉండనున్నాయి.

ఇదీ చదవండి:'పౌరులను కాల్చేసి.. మృతదేహాలను దాచే యత్నం'

ABOUT THE AUTHOR

...view details