ప్రముఖ ఆర్థికవేత్తలు, ఆర్థికరంగ నిపుణులతో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం భేటీ కానున్నారు. కరోనా కారణంగా దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో వృద్ధి రేటును వేగవంతం చేసే చర్యల గురించి ఆర్థిక నిపుణుల నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 29 నుంచి తొలి విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.
నీతి ఆయోగ్ వర్చువల్‌గా నిర్వహించనున్న ఈ సమావేశంలో ఆ సంస్థ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్, సీఈఓ అమితాబ్‌కాంత్ హాజరుకానున్నారు.