ప్రపంచ పునరుత్పాదక ఇంధన పెట్టుబడులపై వర్చువల్గా నిర్వహిస్తోన్న మూడో సదస్సును ప్రారంభించనున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. 'ఆర్ఈ-ఇన్వెస్ట్ 2020' పేరుతో నవంబర్ 26 నుంచి 28 వరకు ఈ సమావేశాన్ని పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది.
వర్చువల్గా జరిగే ఈ సమావేశానికి 75 మంది అంతర్జాతీయ ప్రతినిధులు, 1000 మంది వ్యాపారవేత్తలు, 50,000 మంది వరకు అధికారులు హాజరవుతారని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. పునరుత్పాదక ఇంధనంపై నూతన ఆవిష్కరణలు, పెట్టుబడులపై ప్రధానంగా చర్చించనున్నారని పేర్కొంది.