తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఐఎంసీ'లో నేడు ప్రధాని మోదీ ఉపన్యాసం - సమాచార ప్రసార శాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​

మంగళవారం జరగనున్న నాలుగో విడత ఇండియా మొబైల్​ కాంగ్రెస్​లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ప్రారంభోపన్యాసం చేయనున్నారు. దక్షిణాసియాలోనే అతిపెద్ద టెక్​ సమావేశమైన ఈ కార్యక్రమంలో 30కి పైగా దేశాలు పాల్గొననున్నాయి.

Modi to deliver inaugural address at India Mobile Congress on Tuesday
'ఐఎంసీ'లో ప్రధాని మోదీ ప్రారంభోపన్యాసం

By

Published : Dec 8, 2020, 5:25 AM IST

దేశీయ టెలికామ్​ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో జరగనున్న కీలక సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ప్రారంభోపన్యాసం చేయనున్నారు. మంగళవారం జరగనున్న ఇండియా మొబైల్​ కాంగ్రెస్(ఐఎంసీ)​లో ఆయన వర్చువల్​గా పాల్గొంటారని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) తెలిపింది. సమాచార ప్రసార శాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​, సహాయ మంత్రి సంజయ్​ ధోత్రే, టెలికామ్​ సెక్రెటరీ అన్షు ప్రకాశ్​ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

కొవిడ్​ దృష్ట్యా నాలుగో విడత జరుగనున్న ఐఎంసీని ఈసారి వర్చువల్​గా నిర్వహిస్తున్నారు. రిలయన్స్​ ఇండస్ట్రీస్​ అధినేత ముకేశ్​ అంబానీ, భారతీ ఎంటర్​ ప్రైజెస్​ ఛైర్మన్​ సునీల్​ భారతీ మిట్టల్​, ఎరిక్సన్​ అధిపతి నున్జియో మిర్టిల్లో ఈ కార్యక్రమానికి హాజరవనున్నారు. 30కి పైగా దేశాలు, 210 మంది ఉపన్యాసకులు, 150 మందికి పైగా ఎగ్జిబిటర్లు, 3 వేలకు పైగా సీఈఓ స్థాయి ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు.

టెలికామ్​ రంగంలో స్థానిక ఉత్పత్తలను ప్రోత్సహించడం, ప్రపంచ సహకారాన్ని మెరుగుపరుచుకోవడం, నూతన అవకాశాలను సృష్టించే లక్ష్యంతో ఐఎంసీ 2020 సమావేశం కొనసాగనుందని సీఓఏఐ తెలిపింది. దక్షిణాసియాలోనే ఇదే అతిపెద్ద టెక్​ సమావేశమని పేర్కొంది. రిలయన్స్​ జియో, భారతీ ఎయిర్​టెల్​, వోడాఫోన్​ ఇండియా వంటి కంపెనీలు సీఓఏఐలో సభ్యులుగా ఉన్నాయి.

ఇదీ చూడండి:పాత చట్టాలతో నవ భారతాన్ని నిర్మించలేం: మోదీ

ABOUT THE AUTHOR

...view details