తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ, యోగిని చంపుతామంటూ మెయిల్​.. పోలీసులు అలర్ట్.. త్వరలోనే..

దేశ ప్రధాని నరేంద్ర మోదీని హత్యకు ఓ గుర్తు తెలియని వ్యక్తి కుట్రపన్నాడు. మోదీని, యూపీ సీఎంను చంపేస్తామని ఓ మీడియా సంస్థకు బెదిరింపు మెయిల్ చేశాడు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మెయిల్ పంపిన గుర్తి తెలియని వ్యక్త కోసం దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

modi threatening mail
modi threatening mail

By

Published : Apr 5, 2023, 10:50 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ను​ చంపుతానంటూ ఓ అంగంతుకుడు బెదిరించాడు. గుర్తు తెలియని ఆ వ్యక్తి ఉత్తర్​ప్రదేశ్​ నోయిడాలో ఉన్న ఓ మీడియా సంస్థకు ఈ మెయిల్​ చేశాడు. దీంతో ఆ మీడియా సంస్థ అధికారులు వెంటనే పోలీసులుకు సమాచారం అందించారు. దేశ ప్రధానినే చంపుతామని బెదరింపులు రావడం వల్ల పోలీసులు ఈ కేసులు సీరియస్​గా తీసుకుని విచారణ చేస్తున్నారు.

నోయిడాలోని ఓ ప్రైవేట్​ మీడియా సంస్థ ఛీఫ్ ఫైనాన్షియల్​ ఆఫీసర్​కు.. ఏప్రిల్​ 3న రాత్రి 10:23 గంటలకు ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి మెయిల్ వచ్చింది. ఆ మెయిల్​లో దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​లను చంపేస్తానని బెదిరించాడు. దీంతో మంగళవారం సాయంత్రం ఆ మీడియా సంస్థ ప్రతినిధులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. singhkartik78107@gmail.com అనే మెయిల్ ఐడీతో తమ కార్యాలయానికి సందేశం వచ్చినట్లు వారు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న వెంటనే.. రెండు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు నోయిడా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్​ రజనీశ్​ వర్మ తెలిపారు. దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన విషయం కావడం వల్ల.. కేసును ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పలు సెక్షన్​ల కింద నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సాంకేతిక సహాయంతో నిందితుడి ఆచూకి గుర్తించే పనిలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

"న్యూస్ ఛానల్స్, మీడియా సంస్థల నుంచి తరచూ ఇటువంటి ఈ-మెయిల్స్ వస్తుంటాయి. ఇలాంటి బెదిరింపుల గురించి మాకు వారు తెలియజేస్తారు. సాధారణంగా ఇటువంటి బెదిరింపులను మేము సీరియస్‌గా తీసుకోము. అయితే ఈసారి దేశ ప్రధాని, ముఖ్యమంత్రికి ముప్పు ఉందని పేర్కొన్నందున.. మేము అప్రమత్తంగా ఉన్నాం. ఈ-మెయిల్ పంపినవారిని త్వరలో ట్రాక్ చేస్తాం."
-రజనీశ్​ వర్మ, నోయిడా ఏసీపీ

గతంలోనూ ప్రధాని మోదీను చంపేస్తామని ఏకంగా జాతీయ దర్యాప్తు సంస్థకే ఈ-మెయిల్ వచ్చింది. ముంబైలో ఉన్న ఎన్‌ఐఏ కార్యాలయానికి బెదిరింపు ఈ-మెయిల్‌ రావడం విశేషం. 20 మంది స్లీపర్‌సెల్స్ మోదీని హత్య చేయడానికి రెడీగా ఉన్నట్లు ఈ-మెయిల్‌లో దుండగులు హెచ్చరించారు. దీంతో పాటుగా 20 కేజీల ఆర్‌డీఎక్స్‌ కూడా సిద్ధంగా చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని భద్రతా దళాలు దర్యాప్త చేపట్టాయి. ఇలానే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ను కూడా చంపేస్తామని పోలీసులకు గతంలో వాట్సాప్​ సందేశాలు వచ్చాయి.

నితిన్​ గడ్కరీకి బెదిరింపు కాల్​!
ఇటీవలే ఓ వ్యక్తి కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీపై బాంబు దాడి చేసి చంపేస్తానని బెదిరించాడు. రూ.100 కోట్లు ఇవ్వాలని లేదంటే గడ్కరీని చంపేస్తానని.. ఆయన కార్యాలయానికి కాల్​ చేశాడు. ఈ డబ్బులను తన అడ్రస్​కు పంపాలని ఫోన్​ నంబర్​ కూడా ఇచ్చాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు కర్ణాటక చేరుకుని నిందితుడ్ని అరెస్ట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details