నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల నేపథ్యంలో భాజపా తరఫున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఆయన 23 ప్రచార సభల్లో పాల్గొన్నారు. గత మూడురోజుల్లోనే.. నాలుగు రాష్ట్రాల్లో 10 ర్యాలీలకు హాజరయ్యారు.
బంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీని గద్దె దించి అధికారాన్ని చేపట్టాలని, అసోంలో మరోసారి అధికారాన్ని నిలుపుకోవాలని భాజపా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ రెండు రాష్ట్రాలపై మోదీ ఎక్కువ దృష్టిపెట్టారు. వీటితో పాటు కేరళ, పుదుచ్చేరి, తమిళనాడులోనూ ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.