ట్విట్టర్లో దాదాపు 7 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఓ సాధారణ వ్యక్తికి ప్రత్యేకంగా పట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం నెటిజన్లను సర్ప్రైజ్ చేసింది. మోదీ సందేశం చూసిన ఆ అభిమాని పట్టరాని సంతోషంలో మునిగిపోయారు.
డెక్స్ట్రో అనే వైద్యురాలు ప్రధాని మోదీకి ఫ్యాన్. మంగళవారం ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా తనకు మోదీతో శుభాకాంక్షలు చెప్పించాలని ఆయన అనుసరించే ఓ వ్యక్తిని విజ్ఞప్తి చేశారు. ఈ విషయం మోదీ దృష్టికి వెళ్లింది. వెంటనే ఆయన డెక్స్ట్రోకు బర్త్డే విషెస్ చెప్పారు. అంతే కాదు ఆమె విజ్ఞప్తి మేరకు ఆమె పుట్టినరోజును 'డెక్స్ట్రోదివస్'గా అభివర్ణించారు.