తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వ్యవసాయానికి స్మార్ట్​ హంగులు... ఆధునీకరణపై కేంద్ర బడ్జెట్​ దృష్టి'

MODI ON SMART AGRICULTURE: వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ప్రధాని మోదీ తెలిపారు. రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా 2022-23 బడ్జెట్​లో సరికొత్త నిర్ణయాలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. గత ఏడేళ్లలో రైతులకు వ్యవసాయ రుణాలు 2.5 రెట్లు పెంచామని మోదీ చెప్పారు.

మోదీ
modi

By

Published : Feb 24, 2022, 1:21 PM IST

MODI ON SMART AGRICULTURE: వ్యవసాయ రంగాన్ని ఆధునికంగా, స్మార్ట్​గా మార్చడంపై కేంద్ర బడ్జెట్ 2022-23 దృష్టి సారించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు బడ్జెట్ ఏ విధంగా దోహదపడుతుందనే అంశంపై జరిగిన చర్చలో ప్రసంగించిన ఆయన.. విత్తనాలు వేసే సమయం నుంచి నుంచి మార్కెట్లో విక్రయం వరకు అవసరమయ్యే అనేక కార్యక్రమాలను భాజపా ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. పాత వ్యవస్థలను సైతం మెరుగుపరిచిందని మోదీ పేర్కొన్నారు. ఆరేళ్లలో వ్యవసాయ బడ్జెట్ అనేక రెట్లు పెరిగిందని, రైతులకు వ్యవసాయ రుణాలు కూడా 2.5 రెట్లు పెరిగాయని మోదీ చెప్పారు.

"ఇటీవల బడ్జెట్​లో వ్యవసాయాన్ని ఆధునికంగా మార్చేందుకు ఏడు ప్రధాన మార్గాలను పొందుపరిచాం. గంగానదికి ఇరువైపులా 5 కి.మీల వెంబడి కారిడార్లలో సహజ వ్యవసాయం చేయడం, ఆధునిక సాంకేతికను అందుబాటులోకి తీసుకురావడం వంటివి అందులో తీసుకొచ్చాం. దేశంలో భూసార పరీక్ష ల్యాబ్​ల నెట్​వర్క్​ను రూపొందించడానికి అంకుర సంస్థలు ముందుకు రావాలి."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

బడ్జెట్‌లో వ్యవసాయ రంగంపై కీలక నిర్ణయాలు తీసుకున్నామని, వాటి వల్ల కర్బన ఉద్గారాలు తగ్గుతాయని, రైతులకు అదనపు ఆదాయం కూడా మోదీ వస్తుందని చెప్పారు.

ఇదీ చదవండి:'ఆ కుటుంబ పార్టీలకు ముస్లిం మహిళల కష్టాలు పట్టవా?'

ABOUT THE AUTHOR

...view details