తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Modi Putin Talks : 'మోదీజీ.. G20 సమావేశాలకు రాలేకపోతున్నా'.. ప్రధానికి పుతిన్​ ఫోన్​

Modi Putin Talks : ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్​లో మాట్లాడారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్​. వచ్చే నెలలో దిల్లీలో జరగనున్న జీ-20 దేశాధినేతల సదస్సుకు తాను హాజరు కాలేనంటూ ప్రధాని మోదీకి తెలిపారు.

Modi Putin Talks
Modi Putin Talks

By ETV Bharat Telugu Team

Published : Aug 28, 2023, 10:49 PM IST

Updated : Aug 28, 2023, 10:54 PM IST

Modi Putin Talks : వచ్చే నెలలో దిల్లీలో జరగనున్న జీ-20 దేశాధినేతల సదస్సుకు తాను హాజరు కాలేనంటూ ప్రధాని మోదీకి తెలిపారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌. రష్యా తరఫున విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ భారత్‌కు వస్తారని పుతిన్ వెల్లడించారు. ఈ మేరకు మోదీతో పుతిన్ ఫోన్‌లో మాట్లాడారని ప్రధాని కార్యాలయం తెలిపింది.

ఇద్దరు నాయకులు భారత్-రష్యా మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అనేక అంశాలపై ఫోన్‌లో సమీక్షించినట్లు PMO ఓ ప్రకటనలో వెల్లడించింది. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో ఇటీవల ముగిసిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సహా పలు ప్రాంతీయ ప్రపంచ సమస్యలపై ఇద్దరు నేతలు అభిప్రాయాలను పంచుకున్నారని పేర్కొంది.

భారత్ అధ్యక్షతన జీ 20 సమావేశం
G20 Summit 2023 :కాగా, ఈ ఏడాది జీ-20 బృందానికి భారత్‌ అధ్యక్షత వహిస్తుంది. సెప్టెంబరు 9-10 తేదీల్లో దిల్లీ వేదికగా జీ-20 దేశాధినేతల సదస్సు జరగనుంది.ఈ మేరకు దిల్లీలో పెద్ద ఎత్తున్న ఏర్పాట్లు చేస్తోంది భారత్​. ఈ సమావేశానికి పుతిన్‌ వ్యక్తిగతంగా హాజరయ్యే అవకాశాలున్నాయని గతంలో వార్తలు వచ్చాయి.

హాజరుపై పుతిన్ క్లారిటీ
Putin G20 India : అయితే, దీనిపై ఇంతకుముందే రష్యా స్పష్టత ఇచ్చింది. పుతిన్‌ ప్రత్యక్షంగా హాజరుకాబోరని తెలిపింది. ఆయన వర్చువల్‌గా పాల్గొంటారా? లేదా? అన్న విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. తాను ఏ రకంగానూ ఈ సదస్సులో పాల్గొనబోనని.. తన స్థానంలో విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ హాజరవుతారని చెప్పారు.

బ్రిక్స్​ సమావేశానికి డుమ్మా
Brics Summit 2023 Putin Arrest :మరోవైపు ఇటీవల దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన బ్రిక్స్‌ సదస్సుకు కూడా పుతిన్‌ హాజరు కాలేదు. ఆయన తరఫున సెర్గీ లవ్రోవ్‌ పాల్గొన్నారు. ఈ ఏడాది మార్చిలో అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు పుతిన్‌పై అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. దీంతో ఆయన విదేశాలకు వెళితే అరెస్టయ్యే ముప్పు ఉంది. అందుకే ఆయన జీ20 సదస్సుకు హాజరయ్యేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది.

పుతిన్​కు మోదీ ఫోన్​.. ద్వైపాక్షిక అంశాలపై చర్చ

పుతిన్​కు మోదీ ఫోన్​! ఆ​ అంశంపైనే సుదీర్ఘ చర్చ

Last Updated : Aug 28, 2023, 10:54 PM IST

ABOUT THE AUTHOR

...view details